Begin typing your search above and press return to search.

షాక్ః ఏపీ దేశంలోనే లంచగొండి రాష్ట్రమ‌ట‌

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:11 PM GMT
షాక్ః ఏపీ దేశంలోనే లంచగొండి రాష్ట్రమ‌ట‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలే నివేదిక ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఒక ప‌క్క ఏపీని పెట్టుబ‌డుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తుంటే దేశంలోనే నంబ‌ర్ 2 లంచ‌గొండి రాష్ట్రంగా ఏపీ తేలింది. ఈ మేర‌కు National Council for Applied Economic Research ఇచ్చిన నివేదిక‌లో ఇది స్ప‌ష్ట‌మైంది. మొద‌టి స్థానంలో పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడు ఉండ‌టం గ‌మ‌నార్హం.

National Council for Applied Economic Research విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం దేశంలో పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రాల్లో గుజ‌రాత్ మొద‌టి స్థానంలో ఉండ‌గా ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. త‌మిళ‌నాడుకు మూడో స్థానం - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు నాలుగో స్థానం ద‌క్కింది. బీహార్‌ - జార్ఖండ్ రాష్ర్టాలు ఈ జాబితాలో అట్ట‌డుగు స్థానంలో ఉన్నాయి. ఇక భూసేక‌ర‌ణ‌ - ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల విషయానికి వ‌స్తే ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో చుక్క‌లు చూపించేలా ప‌రిస్థితులు ఉన్నాయ‌ని తేలింది.

పెట్టుబ‌డుల‌కి స్నేహపూర్వకమైన టాప్ 5 రాష్ర్టాల జాబితాలో ఉన్న ఏపీలో లంచాలు అడుగుతున్నారనే విష‌యానికి వ‌చ్చేస‌రికి రెండో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ నివేదిక గురించి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో భిన్న‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో రెండో స్థానంలో ఉండి, తాజాగా ఇచ్చిన నివేదిక‌లోనూ పెట్టుబడులకి సామర్థ్యం - అవకాశం ఉన్నద‌ని తేలిన‌ప్ప‌టికీ కేవలం లంచ‌గొండుల వ‌ల్లే పెట్టుబ‌డులు రాక‌పోయే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెప్తున్నారు. అభివృద్ధి చెందాల‌నుకున్న రాష్ర్టానికి ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.