Begin typing your search above and press return to search.
నో డెడ్ లైన్ : అంబటి... దించుకున్నావా కుంపటి.?
By: Tupaki Desk | 9 Jun 2022 2:30 AM GMTపోలవరం హిస్టారికల్ ప్రాజెక్ట్. ఈ మాట గట్టిగా పదే పదే చెప్పనక్కరలేదు. ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి సంకల్పం ఇది. అలాంటి పోలవరం విభజన తరువాత ఏపీకి ప్రాణాధారం అయిపోయింది. అలాంటి ప్రాజెక్ట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నాయా అన్న డౌట్ అయితే సగటు జనంలో ఉంది.
ఇక ఇప్పటిదాకా ముగ్గురు మంత్రులు జలవనరుల శాఖను చూశారు. వారిలో టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరు చూస్తే ఇదిగో పోలవరం అదిగో పోలవరం అంటూ రిలీజ్ డేట్లు ఇస్తూ పోయాయి. ఆయన దిగిపోయేనాటికి జనాలలో కూడా ఆ ఉత్సాహాం కూడా దిగిపోయింది.
ఆయన తరువాత వైసీపీ ఏలుబడిలో వచ్చిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే అచ్చం దేవినేని తరహాలోనే చాలా డేట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన మంత్రిత్వం ముగిసేవరకూ కధ అలాగే సాగింది. ఇపుడు చూస్తే అంబటి రాంబాబు మంత్రి అయ్యారు. ఈ సీనియర్ నేత పోలవరం ప్రాజెక్ట్ కుండ బద్ధలు కొట్టేశారు.
ఏ టెన్షన్ లేకుండా జనాల అటెన్షన్ ని అటు వైపు పోనీయకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఆయన మెల్లగా చెప్పేది ఏంటి అంటే పోలవరానికి నో డెడ్ లైన్. ఎపుడు పూర్తి అవుతుందో చెప్పలేమని, దశల వారీగా పనులు మాత్రం జరుగుతాయి. అని. ఇదీ అంబటి వారి పోలవరం మాట పాట కూడా.
అంటే పోలవరం గురించి ఇక విపక్షాలు, మీడియా సహా ఎవరూ అడిగే పనిలేకుండా ఆయాసపడే ప్రసక్తే లేకుండా అంబటి వారు చేసుకున్నారు అన్నమాట. ఏపీలో జలవనరుల శాఖలు అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ విషయంలో లైట్ తీస్కోమని జనాలకు చెప్పకనే చెబుతున్నారు అంటే ఇంతకీ పోలవరం అతీ గతీ ఏమవుతుంది అన్నదే అందరి చింతగా ఉంది.
పోలవరం కేంద్రం పూర్తి చేయదు, రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదు. ఈ కొట్టుమిట్టాటలో ఎనిమిదేళ్ళ కాలం అలా జరిగిపోయింది. పోలవరం సినిమానే ఇప్పటిదాకా అంతా చూపించారు. అంబటి వరకూ చూసుకుంటే అలాంటి సినిమాలు తాను చూపించనని రిలీజ్ డేట్లు ఇవ్వనని చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పాలేమో.
మొత్తానికి పోలవరం అనే అతి పెద్ద కుంపటిని అంబటి దించేసుకున్నారా అంటే అవును అనే అనాలేమో. అయితే ఏపీకి పరువు, బరువు అయిన ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇలా లైట్ తీసుకోవడం తగునా అంటే జవాబు అంబటి ఏం జవాబు చెబుతారో.