Begin typing your search above and press return to search.
తెలంగాణ రైతు పై ఏపీ మంత్రి దాడి చేశారా?
By: Tupaki Desk | 13 Jan 2020 4:48 AM GMTమరో వివాదం తెర మీదకు వచ్చింది. అధికారం లోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలపై ఏదో ఒక ఆరోపణ రావటమో.. మరేదో వివాదంలోనో చిక్కుకోవటం తెలిసిందే. తాజాగా చూస్తే.. ఓపక్క థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చిందన్నంతలోనే.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యవహరం రగులుకుంది. ఇదో లెక్కకు వచ్చిందనుకున్నంతలో తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వ్యవహారం ఒకటి తెర మీదకు రావటం ఒక ఎత్తు అయితే.. ఇది పెను సంచలనంగా మారింది. తెలంగాణకు చెందిన ఒక రైతును ఏపీ మంత్రి ఒకరు దాడి చేశారన్న సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజంగానే మంత్రి పెద్దిరెడ్డి ఒక తెలంగాణ రైతు మీద దాడి చేశారా? అన్న విషయంపై బాధిత రైతు చేస్తున్న ఆరోపణలు.. అక్కడి స్థానికులు చెబుతున్న అంశాలు ఇలా ఉన్నాయి. మరోవైపు ఈ దాడిని మంత్రి పెద్ది రెడ్డి వర్గీయులు తప్పు గా కొట్టి పారేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. నిర్మాణ ప్రాజెక్టు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కి చెందిన పీఎల్ఆర్ సంస్థ చేపట్టింది. దీనికి సంబంధించి రెండు దఫాలుగా భూసేకరణ చేపట్టారు. బాధితులుగా చెబుతున్న వారి ఆరోపణల ప్రకారం బస్వాపూర్ కు చెందిన ఉడుత సత్తయ్య.. నర్సింహ.. యాదయ్య కుటుంబాలకు చెందిన భూముల్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నా.. నష్టపరిహారం మాత్రం చెల్లించలేదు. ఇదే కాదు. మరో 21.50 ఎకరాల భూమికి చెల్లింపులు చేయలేదని చెబుతున్నారు.
దీనిపై నెలకొన్న వివాదం నేపథ్యంలో తమకు పరిహారం మొత్తం చెల్లించకుండా పనులు చేస్తున్న వారిని అడ్డుకోవాలని రైతులు భావించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రదేశానికి రైతులు వెళ్లారు. తమకు చెల్లింపులు జరపలేదని.. పరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే పనులు చేపట్టాలన్నారు.
ఇదే సమయంలో ఇక్కడకు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి రావటం.. ఆయన గన్ మెన్లు.. అనుచరులు తమపై దాడి చేసి గాయపర్చినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. తమపై మూకుమ్మడి దాడి జరిగిందని. . పిడిగుద్దులతో తమను గాయపర్చినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. పనులు ఆపేయటానికి నువ్వెవడిరా? అంటూ తమను తిట్టి..కొట్టినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పెద్దిరెడ్డి సంస్థ కు చెందిన మేనేజర్ మాత్రం.. రైతుల మాటల్లో నిజం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. తమ ఉద్యోగి పైనే రైతులు దాడి చేసి గాయ పర్చారని చెబుతున్నారు. దీనికి రైతుల వెర్షన్ వేరుగా ఉంది. తమ మీద ఏపీ మంత్రి పెద్ది రెడ్డి గన్ మెన్.. వారి ఉద్యోగులు దాడి చేస్తున్న వేళ.. నిస్సహాయ పరిస్థితుల్లో చేతికి అందిన మట్టి పెళ్లను విసిరటంతో ప్రాజెక్టు పనులు చేస్తున్న ఉద్యోగి కి తగిలి గాయమైందే తప్పించి.. తాము దాడి చేయ లేదంటున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు బయట కు వచ్చి సంచలనం గా మారుతోంది. దాడుల వరకూ అసలు ఎందుకు వెళ్లింది? రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఎందుకు చెల్లించలేదు? అన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. సమయానికి పరిహారం చెల్లిస్తే.. రైతులు ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరమే ఉండేది కాదన్నది పాయింటే అయినా.. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు ఏపీ ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన సంస్థ అధికారికంగా ఎలాంటి వివరణ ఇస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.