Begin typing your search above and press return to search.
ముందే జాగ్రత్త పడుతున్న మంత్రి అవంతి...?
By: Tupaki Desk | 23 March 2022 11:30 PM GMTవిశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు దాదాపుగా మూడేళ్ళ పాటు అమాత్య హోదాను అనుభవించేశారు. ఇక ఆయనకు మరోసారి చాన్స్ లేదని తేలిపోయింది. విశాఖ నుంచి విస్తరణలో వంశీకి మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు. మొత్తానికి చూస్తే అవంతి మాజీ కావడానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు.
ఈ విషయం మీద చాలా రోజులుగా ప్రచారం సాగుతూండడంతో మంత్రి గారు కూడా తగిన విధంగానే ప్రిపేర్ అయ్యారని అంటున్నారు. ఆయన ఫోకస్ ఇపుడు వచ్చే ఎన్నికల మీద ఉంది. మళ్ళీ భీమిలీ నుంచి పోటీ చేసి మూడవసారి గెలవాలని అవంతి అనుకుంటున్నారు. దానికి తగిన విధంగా వ్యూహరచనను కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు.
విశాఖ జిల్లా మొత్తానికి మంత్రిగా ఉన్న అవంతి అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం తన సొంత నియోజకవర్గంలోనే ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇక జీవీఎంసీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే అందులో అధిక భాగం నిధులను భీమిలీలోని పలు కార్యక్రమాలను మంత్రి చేపట్టారని విపక్షాలు విమర్సిస్తున్నాయి.
దీని మీద జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ అయితే మంత్రి తన సొంత ప్రాంతం అభివృద్ధి మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. తన వార్డుకు కనీసంగా కూడా నిధులు ఇవ్వలేదని, పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఎక్కడెక్కడి నిధులు, అభివృద్ధి పనులను పోగు పోసి మరీ భీమిలీలోనే ఎక్కువగా మంత్రి ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం ఆయన 2024 ఎన్నికల వేళ జనాల మెప్పు పొంది గెలవాల్సిన అవసరం ఉంది. అటువైపు చూస్తే ప్రత్యర్ధి పార్టీలు బలంగా ఉన్నాయి. భీమిలీలో జనసేన స్ట్రాంగ్ గా ఉంది. టీడీపీకి అది కంచుకోట.
ఇక ఆ రెండు పార్టీలు కలిస్తే కనుక వైసీపీకి ఇబ్బందులు తప్పవు. దాంతో అవంతి ఇపుడు అభివృద్ధి నినాదాన్ని అందుకుంటున్నారని అంటున్నారు. మరి జనాలు వచ్చే ఎన్నికల్లో దాన్ని ఎంతవరకూ విశ్వసిస్తారు అన్నది చూడాలి. ఇక పోతే 2019 ఎన్నికల వేళ రాజకీయంగా అన్నీ సమీకరణలనూ బేరీజు వేసుకుని వైసీపీలోకి దూకి ఏకంగా మినిస్టర్ అయిన అవంతికి 2024 ఎన్నికలు మాత్రం టఫ్ గానే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి మంత్రి గారి ముందు జాగ్రత్త చర్యలు ఎంతమేరకు ఫలిస్తాయో.