Begin typing your search above and press return to search.

అవంతికి టఫ్ జాబ్... ?

By:  Tupaki Desk   |   6 April 2022 11:30 PM GMT
అవంతికి టఫ్ జాబ్... ?
X
విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా జగన్ క్యాబినెట్లో ముప్పయి నాలుగు నెలల పాటు పనిచేసిన అవంతి శ్రీనివాసరావుకు ఇక మీదట విశాఖ జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు అసెంబ్లీ సీట్లలో కాపుల డామినేషన్ ఎక్కువ.

ఇక ఇరవై లక్షల జనాభా ఉన్న కొత్త జిల్లాలో కాపులు, యాదవులు, బీసీలు ఎక్కువ. దాంతో కాపులను ఆకట్టుకునేందుకు జిల్లా ప్రెసిడెంట్ గా అవంతిని ముందుంచుతారు అని తెలుస్తోంది. అదే విధంగా కొత్త జిల్లాలో వైసీపీని మొత్తానికి మొత్తం సీట్లను గెలిపించే బాధ్యతలు కూడా ఆయన మీదనే పెట్టాలనుకుంటున్నారు.

విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకుంటే రెండు సీట్లు వైసీపీ గెలిచింది. దాంతో ఈ జిల్లా సారధ్యం అంటే టఫ్ జాబ్ గానే చూడాలి. ఓడినా సరే విశాఖ జిల్లావ్యాప్తంగా టీడీపీ ఇప్పటికీ బలంగా ఉంది. ధీటైన నాయకులు ఎక్కువగా టీడీపీలోనే ఉన్నారు.

దాంతో విశాఖ జిల్లాలో వైసీపీ జెండా ఎగరేయడం అంటే కష్టంతో కూడుకున్న పనే అని చెప్పాలి. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 98 వార్డు కార్పోరేటర్లకు గానూ ముప్పయి దాకా గెలుచుకుంది. ఇక వచ్చే ఎన్నికల్లో మరో మారు నాలుగు సీట్లతో పాటు, వైసీపీ చేతిలో ఉన్న రెండు సీట్లను కూడా కైవశం చేసుకోవాలని పావులు కదుపుతోంది.

ఇక అవంతికి భీమిలీ సీటే ఒక సవాల్ గా మారనుంది. మరి ఆయనకు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగిస్తే రెండింటికీ న్యాయం చేయగలరా అన్న ప్రశ్న కూడా ఉంది. మొత్తానికి మంత్రిగా హాయిగా ఉంటూ వచ్చిన అవంతి మాజీ అవడంతోనే పార్టీ బాధ్యలత పేర బరువుని తగిలించనున్నారా అన్న చర్చ అయితే ఆయన అభిమానులలో అనుచరులలో వస్తోంది.