Begin typing your search above and press return to search.
అయ్యన్న ఘాటు మాట!... రోజా తింగరబుచ్చి!
By: Tupaki Desk | 5 Nov 2017 10:05 AM GMTతెలుగు నాట రాజకీయ నేతల నోట వచ్చే మాటలు నానాటికీ ఘాటెక్కుతున్నాయి. లోకల్ స్లాంగ్ అంటూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం చేసే వ్యాఖ్యలే ఇప్పటిదాకా ఘాటు వ్యాఖ్యలుగా వినిపించాయి. అయితే తాము కూడా కేసీఆర్‌కు ఏమాత్రం తీసిపోమంటూ అటు తెలంగాణతో పాటు ఇటు నవ్యాంధ్రకు చెందిన నేతలు కూడా తమ స్థాయిని మరిచి మాట్లాడేస్తున్నారు. మహిళలు అన్న ఇంగితం కూడా లేకుండా మగ మహారాజులుగా వెలిగిపోతున్న నేతాశ్రీలు నోటికి ఎంత మాట వస్తే... అంత మాట అనేస్తున్నారు. అసలు ఈ మాటలకు ఇక్కడిక్కడ అడ్డుకట్ట పడకపోతే... మున్ముందు మన నేతాశ్రీీల నోట బూతులు వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయినా ఈ తరహా వ్యాఖ్యలు ఏ కుర్ర నేతల నుంచో వస్తుంటే... ఏదో అనుభవం లేదనుకోవచ్చు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల నోట నుంచే ఈ తరహా మాటలు వినిపిస్తుండటం నిజంగా ఆశ్చర్యరమేనని చెప్పక తప్పదు.
ఇక అసలు విషయానికి వస్తే... వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... అధికార పక్షంపై విరుచుకుపడే తీరు కాస్తంత ఘాటుగానే ఉంటోందన్న వాదన ఉంది. ఈ విషయం ఏ ఒక్కరూ కాదనలేకపోయినా... సయమానుకూలంగా రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నా... ఆమె విమర్శల్లో కాస్తంత వాస్తవికత ఉందన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు. అయితే రోజాను అదుపు చేసేందుకంటూ రంగంలోకి దిగేస్తున్న టీడీపీ నేతలు ఆమె కంటే కూడా మరింత ఘాటు కామెంట్లు చేస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, రోజా మధ్య కొనసాగిన వార్ అండ్ వర్డ్స్... ఇలాంటి నేతల కారణంగా రాజకీయాలు నాశనమవుతాయన్న భావన కలిగింది. అయితే ఇద్దరూ కూడా పాలిటిక్స్‌కు కొత్తే కాబట్టి... ఆ వార్ అండ్ వర్డ్స్‌ను అంత పెద్దగా పట్టించుకోలేదు. అయితే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న చేసిన వ్యాఖ్యలు వింటే నిజంగానే షాక్ తినక తప్పదు. రోజాను తింగరబుచ్చిగా అభివర్ణించిన అయ్యన్న... రోజాపై అనూహ్య దాడికి దిగారు. అసలు అయ్యన్న నోట నుంచి ఈ తరహా మాటలు వినబడే సరికి అక్కడున్న తెలుగు తమ్ముళ్లే షాక్ తిన్నారట.
ఇక అయ్యన్న చేసిన సదరు వ్యాఖ్యలు, సందర్భం విషయానికి వస్తే... ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా నిన్న విశాఖపట్టణం జిల్లా చీడికాడలో ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న పూనకం వచ్చిన వాడల్లే రోజాపై ఘాటు విమర్శలు చేశారు. రోజా... ఓ తింగరబుచ్చి అంటూ ఘాటు వ్యాఖ్య చేసిన అయ్యన్న... జబర్దస్త్‌లో డాన్సులు చేసే తింగరబుచ్చికి ఏమీ తెలియదని కూడా కాస్తంత వెగటు వ్యాఖ్యలే చేశారు. అయినా రోజా మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదన్నారు. వైసీపీ చీఫ్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న రోజా వ్యాఖ్యలపై స్పందిస్తూ అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఆమె చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయని అయ్యన్న చెప్పారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నాయకులు కూడా అడ్డగోలుగా చౌకబారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అయ్యన్న ఎద్దేవా చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.