Begin typing your search above and press return to search.

మహిళలపై మంత్రి అయ్యన్న దారుణవ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Jan 2019 9:49 AM GMT
మహిళలపై మంత్రి అయ్యన్న దారుణవ్యాఖ్యలు
X
ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోరుపారేసుకున్నారు. మహిళలను అని కూడా చూడకుండా దారుణ వ్యాఖ్యలు చేశారు. దుక్కలా ఉండి పెన్షన్ తీసుకుంటారా అని మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేశారు. భర్తలను మీరు రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారని.. మీకు పెన్షన్ ఎందుకు అంటూ ఆడిపోసుకున్నారు.

విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు పింఛన్లపై నిలదీసిన మహిళలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..

‘భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇవ్వడానికి అభ్యతరం లేదు. కానీ దుక్కలా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా.? ఊళ్లో భర్తలేడని కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు. ఉన్నాడా పోయాడా చెప్పరు. పదేళ్లుగా జాడాలేదంటున్నారు. అలాంటి వారికి పెన్షన్ ఎందుకిస్తాం.. ఎక్కడి నుంచి ఇస్తాం. మీ భర్తలను రాచిరంపాన పెట్టి తరిమేస్తే మేము పింఛన్ ఇయ్యాలా’ అని మహిళలను కించపరిచేలా మాట్లాడారు.

మంత్రి అయ్యన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సమావేశానికి వచ్చిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడతారా అని మండిపడ్డారు.