Begin typing your search above and press return to search.
వైఎస్ కు 26 ఏళ్లు.. కేసీఆర్ కు పద్నాలుగేళ్లు.. మరిచారా బొత్స?
By: Tupaki Desk | 2 Oct 2021 2:30 PM GMTపార్టీ పెట్టినంతనే అధికారం చేతికి వస్తుందా? రాజకీయాలకు సంబంధించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారు కూడా.. రాదనే చెబుతారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక ఎన్టీఆర్.. ఒక కేజ్రీవాల్.. ఇలా కొందరికి మాత్రమే సాధ్యమయ్యే మేజిక్.. అందరి విషయాల్లో జరగాలని లేదు. అంత మాత్రానికే ఎటకారాలు చేయటం వల్ల రాజకీయంగా లాభిస్తుందేమో కానీ.. చర్చకు ఏ మాత్రం సూట్ కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
తాజాగా జనసేన అధినేత పవన్ మీద ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. పదిహేనేళ్లుగా పవన్ ఏం తేల్చాడని.. ఏం సాధించారని ప్రశ్నించారు. పవన్ సీరియస్ గా రాజకీయాల్ని తీసుకున్నది 2019 ఎన్నికలకు కాస్త ముందే తప్పించి.. అంతకు ముందంతా ఆన్ అండ్ ఆఫ్ అన్నట్లే వ్యవహరించారు. వైఎస్ జగన్ విషయానికే వస్తే ఆయన 2009లోనే ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ..రాజకీయాల్ని సీరియస్ గా తీసుకున్నది తన తండ్రి మరణం తర్వాతనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అప్పటి నుంచి ఆయన ఎన్నో ఆటుపోట్లు.. ఎదురుదెబ్బలు తిన్నాక మాత్రమే 2019లోఅధికారాన్ని సొంతం చేసుకున్నారన్నది మర్చిపోకూడదు. పార్టీ పెట్టిన దాదాపు ఎనిమిదేళ్ల సీరియస్ గా ప్రయత్నించిన తర్వాతే ఆయన సీఎం అయ్యారన్నది మర్చిపోకూడదు.
నిజానికి జగన్ కు తన తండ్రి వైఎస్ ఇమేజ్.. ఆయన రాజకీయ వారసుడిగా ప్రజల దన్ను లభించింది. ఆయనకంటూ ఒక ఓటు బ్యాంకు ఆయన పార్టీ పెట్టానికి ముందే దివంగత మహానేత పుణ్యమా అని సమకూరిందన్నది మర్చిపోకూడదు. జగన్ సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆయన తండ్రి వైఎస్ విషయానికి వస్తే.. దాదాపు పాతికేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత మాత్రమే ఆయన ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నది మర్చిపోకూడదు.
జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన రాజకీయాలు.. సినిమాలు అనే రెండు పడవల మీద ప్రయాణం చేశారు. ఆయన రాజకీయ ప్రయణం మీద పెద్దగా ఫోకస్ చేసింది లేదని చెప్పాలి. అలాంటప్పుడు ఆయన రాజకీయాల్లో వచ్చిన తేదీ నుంచి లెక్కలు చెప్పి పక్క దారి పట్టించటం మినహా బొత్స చేస్తున్నదేమీ లేదు. ప్రజారాజ్యం పెట్టిన నాటి నుంచి పవన్ చొక్కాలు చింపుతున్నాడని.. ఇపపటివరకు ఎన్నిచిరిగిపోయాయో? అంటూ బొత్స చేసిన ఎటకారం వినేందుకు బాగానే ఉన్నా.. లాజిక్ గా చూస్తే మాత్రం అంత సీనియర్ అయి ఉండి ఇలా మాట్లాడటమా? అన్న విమర్శ వినిపిస్తోంది.
తాజాగా జనసేన అధినేత పవన్ మీద ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. పదిహేనేళ్లుగా పవన్ ఏం తేల్చాడని.. ఏం సాధించారని ప్రశ్నించారు. పవన్ సీరియస్ గా రాజకీయాల్ని తీసుకున్నది 2019 ఎన్నికలకు కాస్త ముందే తప్పించి.. అంతకు ముందంతా ఆన్ అండ్ ఆఫ్ అన్నట్లే వ్యవహరించారు. వైఎస్ జగన్ విషయానికే వస్తే ఆయన 2009లోనే ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ..రాజకీయాల్ని సీరియస్ గా తీసుకున్నది తన తండ్రి మరణం తర్వాతనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అప్పటి నుంచి ఆయన ఎన్నో ఆటుపోట్లు.. ఎదురుదెబ్బలు తిన్నాక మాత్రమే 2019లోఅధికారాన్ని సొంతం చేసుకున్నారన్నది మర్చిపోకూడదు. పార్టీ పెట్టిన దాదాపు ఎనిమిదేళ్ల సీరియస్ గా ప్రయత్నించిన తర్వాతే ఆయన సీఎం అయ్యారన్నది మర్చిపోకూడదు.
నిజానికి జగన్ కు తన తండ్రి వైఎస్ ఇమేజ్.. ఆయన రాజకీయ వారసుడిగా ప్రజల దన్ను లభించింది. ఆయనకంటూ ఒక ఓటు బ్యాంకు ఆయన పార్టీ పెట్టానికి ముందే దివంగత మహానేత పుణ్యమా అని సమకూరిందన్నది మర్చిపోకూడదు. జగన్ సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆయన తండ్రి వైఎస్ విషయానికి వస్తే.. దాదాపు పాతికేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత మాత్రమే ఆయన ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నది మర్చిపోకూడదు.
మాటల మాంత్రికుడిగా.. తిరుగులేని అధినేతగా.. తెలంగాణలో ఆయనకు తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదన్న పేరున్న కేసీఆర్ సైతం.. పార్టీ పెట్టిన పదమూడేళ్లకు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఎవరూ కూడా ఇలా పార్టీ పెట్టి అలా.. విజయాన్ని సొంతం చేసుకోలేదన్న సత్యాన్ని బొత్స మర్చిపోయినట్లున్నారు. పవన్ ను తప్పు పట్టే పేరుతో ఆయనపై ఘాటు విమర్శలు చేస్తున్న బొత్స.. పదిహేనేళ్లుగా ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టి.. ఆ పార్టీ యువజన విభాగాన్ని పవన్ కల్యాణ్ లీడ్ చేసినప్పటికీ.. సీరియస్ పాలిటిక్స్ ను షురూ చేసింది మాత్రం 2019 ఎన్నికలకు ఏడాదిన్న ముందు మాత్రమే.