Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రిగారి మాట విన్నారా? కేసు పెడితే వాన దేవుడి మీద పెట్టాలట
By: Tupaki Desk | 1 Dec 2021 8:31 AM GMTఏపీ అధికార పార్టీ నేతలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వారు.. అదే పనిగా ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో ఫస్ట్రేషన్ కు గురవుతున్నారు. ఇప్పటికే చికాకు పెడుతున్న నిధుల కొరతకు.. మౌలిక వసతుల విషయంలో ప్రజల్లో నెలకొన్న ఆగ్రహానికి సమాధానాలు చెప్పలేకపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి? అన్న ప్రశ్నకు చిన్న పిల్లాడు సైతం చిరాగ్గా ముఖం పెట్టేసే పరిస్థితి. ఏపీ రోడ్ల పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారిన వేళ.. ఈ రోడ్ల మీద వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం వర్షాలు పుడుతున్నాయి. ఇప్పుడు రోడ్లు వేస్తే త్వరగా పాడవుతాయి. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు వేస్తామన్న ప్రకటనను చేశారు. దీంతో రోడ్లు బాగోకున్నా.. సర్దుకుపోతున్నారు ఏపీ ప్రజలు. ఇలాంటి వేళ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ రోడ్లు ఏంటిలా అధ్వానంగా ఉన్నాయి సార్? అని ప్రశ్నించిన పాపానికి నారాయణస్వామి విచిత్రమైన రీతిలో రియాక్టు అయ్యారు.
‘‘ఇదంతా ఆ వానదేవుడి తప్పు.. వర్షాలు బాగా కురుస్తున్నందునే రోడ్లు బాగా చెడిపోతున్నాయి. ఏదైనా కేసు పెట్టాలంటే ఆయనపైనే పెట్టటండి’’ అంటూ కామెంట్లు చేశారు. అక్కడితో ఆగని ఆయన విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. చంద్రబాబుకు పాలన చేతకాదని.. ఆయన తన సామాజిక వర్గాన్ని బాగు చేసుకునేందుకు పవర్ కోసం వెంపర్లాడుతున్నారన్నారు. తన కొడుకును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకునేందుకు ఆయన వెంపర్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ద్రష్టి మొత్తం అధికారం మీదనే తప్పించి ప్రజలపై లేదన్నారు.
టీడీపీ ప్రభుత్వం నాణ్యత లేని రోడ్లు వేసి దోచుకుందన్న ఆయన.. ఆ వరుణ దేవుడు కూడా వారికి బుద్ధి రావటానికి రోడ్లను ఇలా పాడు చేశారన్నారు. ఇలా.. రోడ్లు బాగా లేకపోవటానికి కారణం కంటికి కనింపిచని వరుణదేవుడు.. కంటి ముందు ఉండే చంద్రబాబు తప్పించి.. తమ తప్పేమి లేదన్నట్లుగా చెబుతున్న నారాయణ స్వామి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. బాబు దుష్టపాలనకు చెక్ చెప్పేందుకే భగవంతుని స్వరూపంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
సాధారణంగా రాజకీయాల్లో అధినేతను పొగడ్తలతో ముంచెత్తటం మామూలే అయినా ఈ స్థాయిలో పిసికేయటం మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామికే చెల్లుతుందని చెప్పాలి. అసెంబ్లీలో సీఎం జగన్ లేనప్పుడు రెచ్చగొట్టేలా ప్రవర్తించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. గొడ్డలి.. బాబాయ్.. తల్లి.. చెల్లి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో మాధవరెడ్డి.. వంగవీటి మోహన రంగా హత్యలపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరినట్లు చెప్పారు. ఈ మాటల్ని జీర్ణించుకోలేని చంద్రబాబు పవిత్రమైన భార్యను తెర మీదకు తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసుకున్నారన్నారు.