Begin typing your search above and press return to search.
ప్రశాంత్ కిశోర్ మీద హాట్ కామెంట్లు చేసిన ఏపీ మంత్రి!
By: Tupaki Desk | 23 April 2022 9:39 AM GMTఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి.. కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో జగన్ తో పొత్తు పెట్టుకోవాల ని.. వ్యూమకర్త ప్రశాంత్ కిశోర్ సూచించారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ విషయం అటు ఢిల్లీలోనూ.. ఇటుఏపీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్..త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన గత వారం రోజులుగా కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారు. వచ్చే 2024 సార్వ త్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలో ఆయన నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. మంచిదని.. అప్పుడు కానీ.. పట్టు సాధించ లేరని.. ఆయన ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయం జాతీయ రాజకీ యాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో వైసీపీ.. కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతుందా? అనేది కీలక సందేహం. ఎందుకంటే.. గతా న్ని తెరమీదికి తెస్తే.. కాంగ్రెస్‌ను బలంగా వ్యతిరేకించిన జగన్.. సోనియానే టార్గెట్ చేస్తూ.. తన మీడియా లో కథనాలు వినిపించారు. అప్పటికి యూపీఏ అధికారంలో ఉంది అలాంటి సమయంలోనే ఆయన కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పార్టీ పెట్టి.. ప్రజలలోకి వచ్చారు. కాంగ్రెస్‌పై పైచేయి సాధించారు. 2012 ఉప ఎన్నికలోనే ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ సత్తా చాటింది.
సీబీఐ కేసులు పెట్టించిందని, తన వ్యాపార ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని ప్రయత్నించిందని... జగన్ దూరం పెట్టిన పార్టీని ఇప్పుడు అక్కున చేర్చుకోమని ప్రశాంత్ కిశోర్ ఎలా చెప్పారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు కాంగ్రెస్ అంటేనే జగన్‌కు పడదు. అలాంటి పార్టీతో జగన్ జట్టు కట్టడం అనేది ససేమిరా సాధ్యమయ్యేది కాదు. ఇదే మాటను తాజాగా.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పారు. అసలు దేశంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకలించేసే ప్రక్రియ వైసీపీతోనే ప్రారంభమైందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్‌తో వైసీపీ కలవడమేంటి కేమిడీ కాకపోతే.. అని కూడా మంత్రి వ్యాఖ్యానించారు. అసలు పీకే ఎందుకు ఇలాంటి సలహా ఇచ్చారనేది కూడా చర్చగా మారింది. ఇటీవల కాలంలో పీకే మైండ్ సరిగా పని చేయడంలేదా? అని వైసీపీ నాయకులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు నుంచి పీకే జగన్‌తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అసలు వైసీపీ ఆవిర్భావం ఎలా జరిగిందో.. ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో.. పీకేకు తెలియదా? కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై వైసీపీ రాజకీయం గూడుకట్టుకుందన విషయం ఆయనకు ఎరుక లేదా?
అలాంటి వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని.. ఆయన మైండ్ ఉండే సలహా ఇచ్చారా? అనేది వైసీపీ సీనియర్ల మాట. నిజానికి ఒక వేళ పొత్తు పెట్టుకుంటే.. ఏం జరుగుతుంది. చచ్చిపోయిన పార్టీకి చేజేతులా.. జగన్ ఆక్సిజన్ అందించినట్టేనని అంటున్నారు. అసలు ఇది జరిగేది కాదని.. పీకేకు మతిభ్రమించి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి ఉంటాడని.. సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి పీకే సలహా విషయంపై వైసీపీలో బాగానే చర్చ సాగుతుండడం గమనార్హం.