Begin typing your search above and press return to search.
టాప్ సీక్రెట్ : 'ఈయనేం సీఎం..' అంటున్న ఏపీ మినిస్టర్!
By: Tupaki Desk | 31 July 2019 7:01 AM GMTఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ లోకి కొందరు అనామకులను కూడా తీసుకున్నారనేది జనాభిప్రాయం. వారికి అంత ప్రజాబలం లేకపోయినా, వారితో పోలిస్తే సీనియర్లు, జగన్ కు వీరాభిమానులు ఉన్నప్పటికీ వారిని కాదని జగన్ మోహన్ రెడ్డి కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. అలా వారిని గౌరవించారు జగన్.
అలాంటి వారు అయితే బాగా పని చేస్తారు, అత్యాశకు పోరు అని జగన్ భావించి ఉండవచ్చు. అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగా కొత్త వాళ్లకు, బడుగు బలహీన వర్గాల వారికి మంత్రి పదవులను కేటాయించి రాజకీయంలో కొత్త ఒరవడి సృష్టికి ప్రయత్నిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఇలాంటి నేపథ్యంలో తన పార్టీ నేతలను జగన్ పరిపరి విధాలుగా కంట్రోల్ చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పాలన సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిణామాలను కొంతమంది మంత్రులే జీర్ణించుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. గతంలో ప్రతి పనిలోనూ మంత్రులు- ఎమ్మెల్యేలు డబ్బులు కొట్టేవాళ్లు. బదిలీల్లో, నియామకాల్లో అయితే వారికి కోరినంత డబ్బులు వచ్చేవి.
అయితే జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్లకు అలాంటి అవకాశాలు ఏమీ ఇవ్వలేదు. అధికారుల బదిలీల్లో లంచాలకు ఆస్కారం లేకుండా, సిఫార్సులకు అవకాశం లేకుండా చేశారు జగన్ మోహన్ రెడ్డి. బదిలీల దగ్గర లంచాలను, సిఫార్సులను ఆపడం ద్వారా జగన్ నూతన ఒరవడి సృష్టించారు. అవినీతి రహిత పాలనకు ఇది అవకాశం అయ్యేలా ఉంది.
అయితే ఇది మాత్రం కొందరికి నచ్చడం లేదట. రాయలసీమ ప్రాంతానికే చెందిన ఒక మంత్రి ముఖ్యమంత్రి మీదే కామెంట్లు చేశారట. అవినీతి విషయంలో తమ చేతులు కట్టేసినందున 'ఈయనేం ముఖ్యమంత్రి..' అంటున్నాడట ఆ మంత్రి. తన సహచర నేతల వద్ద ఆ మంత్రి ఇలా అంటున్నాడట.
'నేతలకు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి, కార్యకర్తలను ఉద్ధరించాలి కానీ ఇలా అవినీతి రహిత అంటే ఎలా..' అంటున్నాడట ఆ మంత్రి!