Begin typing your search above and press return to search.
మినిష్టర్ ధర్మాన... కొత్త రికార్డు
By: Tupaki Desk | 14 April 2022 2:30 AM GMTశ్రీకాకుళం జిల్లాలో చూస్తే రాజకీయ కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కింజరాపు ఫ్యామిలీ ఒక వైపు ఉంటే ఆపోజిట్ గా ధర్మాన ఫ్యామిలీ ఉంది. ఈ రెండు కుటుంబాలు గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నాయి. కింజరాపు ఫ్యామిలీలో ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చి కేంద్ర మంత్రి దాకా హోదా అనుభవించారు. ఒక దశలో లోక్ సభ స్పీకర్ కూడా కావాల్సింది, తృటిలో తప్పిపోయింది.
ఇక ఆయనకు రాష్ట్ర మంత్రి కావాలని ఉండేది. కానీ ఆ ముచ్చట తమ్ముడు అచ్చెన్నాయుడు రూపంలో తీరింది. ఇక కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా రెండు సార్లు ఎంపీగా గెలిచి రాణిస్తున్నారు. అచ్చెన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూంటే ఇటు వైపు నుంచి ధర్మాన ఫ్యామిలీ వారికి ఎదురు నిలిచి ఉంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏవైనా పదవి ధర్మాన ఫ్యామిలీకే దక్కుతుంది.
అన్న ధర్మాన క్రిష్ణ దాస్ 34 నెలలు తొలి విడతలో మంత్రి పదవిని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇపుడు తమ్ముడు ప్రసాదరావు వంతు. రెవిన్యూ శాఖ మంత్రిగా ప్రసాదరావుకు జగన్ కీలకమైన బాధ్యతలే అప్పగించారు. గతంలో అంటే వైఎస్సార్ టైమ్ లో ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా కీలకంగా వ్యవహరించారు.
ఇక ప్రసాదరావు రాజకీయ నేపధ్యం చూసుకుంటే ఆయన 1989లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా నరసన్నపేట నుంచి గెలిచారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేశారు. 2004లో 2009 లో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెండు ప్రభుత్వాల్లో ఫుల్ టైమ్ మంత్రిగా పనిచేశారు. వివిధ శాఖలను ఆయన చూశారు. అలా వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ముఖ్యమంత్రిత్వంలో ప్రసాదరావు మంత్రిగా రాణించారు అని చెప్పాలి.
శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే ధర్మాన 13 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన రికార్డుని కలిగి ఉన్నారు. ఆయనను ఈ విషయంలో బీట్ చేసిన వారు ఇప్పటివరకూ లేరు అంటే అది ప్రసాదరావు గొప్పదనమే మరి. ఈ జిల్లా నుంచి ఫస్ట్ మంత్రి అయిన వారు సర్దార్ గౌతు లచ్చన్న. ఆయన కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే అందులో మంత్రిగా సేవలు అందించారు. ఇక ఇప్పటిదాక సిక్కోలు నుంచి పదమూడు మంది మంత్రులు పనిచేశారు. అందరిలోనూ ప్రసాదరావే అత్యధికం మంత్రిత్వం చేపట్టిన వారుగా ఉన్నారు.
ఆ తరువాత తమ్మినేని సీతారాం పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆయన తరువాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం అంటే ఎనిమిదిన్నర ఏళ్ల పాటు మంత్రిగా సేవలు అందించిన ఘనత ప్రతిభా భారతిది. మొత్తానికి చూస్తే జగన్ హయాంలో రెండేళ్ళూ కలిపితే ప్రసాదరావు పదిహేనేళ్ళు మంత్రిగా ఉన్నట్లు అన్న మాట. ఈ రికార్డుని శ్రీకాకుళం జిల్లాలో ఇప్పట్లో అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు అనే చెప్పాలి.