Begin typing your search above and press return to search.
ఆ మంత్రి మీద మండిపోతున్న ఉద్యోగులు
By: Tupaki Desk | 17 April 2022 1:30 PM GMTకొత్తగా మంత్రి అయ్యారు. ఇంకా ఉద్యోగులతో సమావేశాలు లేవు. మంచీ చెడ్డా కూడా కూర్చుని మాట్లాడుకోలేదు. కానీ ఆ మంత్రి గారు చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఉద్యోగులలో అగ్గి రాజేశాయి. ఇంతకీ ఆ మంత్రి గారు ఎవరూ ఏమా కధా కమామీషూ అంటే చాలానే ఉంది. ఆ మంత్రి గారు సీనియారిటీ కలిగిన వారు. ఆయనే ధర్మాన ప్రసాదరావు. ఆయన తాజాగా తన జిల్లాలో జరిగిన అభినందన సభలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోందని ఆయన గట్టిగానే మాట్లాడారు, అంతే కాదు, ఈ శాఖలో జరుగుతున్న అవినీతిని చూసి సిగ్గుపడాలని పరుషంగానే మాట్లాడారు. అవినీతి రహితమైన వ్యవస్థగా రెవిన్యూ శాఖను చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పనిలో తాను సక్సెస్ అవుతానో లేదో అని కూడా డౌట్ పడ్డారు
మొత్తానికి చూస్తే మంత్రి గారి మాటలు అయితే రెవిన్యూ ఉద్యోగులలో మంటలు పుట్టించాయి. ధర్మాన వారు ఇలా అన్నారో లేదో కానీ ఆ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు అయితే గట్టిగా రిటార్ట్ ఇచ్చాయి. మంత్రి గారి మాటలు తమను బాగా బాధించాయి అని కూడా వారు నొచ్చుకున్నారు. తాము కష్టపడి పనిచేస్తూంటే మంత్రి గారు ఇలాంటి మాటలు అనవచ్చా అని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం ద్వారా జరిగే ఎనభై రకాల సేవలను రెవిన్యూ శాఖ చేస్తోందని రెవిన్యూ ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకట్వేశ్వరరావు, చేబ్రోలు క్రిష్ణమూర్తి, పితాని శ్రీనివాసరావు అంటున్నారు. కరోనా టైమ్ లో కూడా రాత్రీ పగలు తాము కష్టపడ్డాని చెప్పుకున్నారు. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో స్కాచ్ అవార్డు వచ్చింది అంటే అది రెవిన్యూ ఉద్యోగుల గొప్పతనమే అని వారు గుర్తు చేస్తున్నారు.
ఇక భూసర్వే విషయంలో తాము తీవ్ర వత్తిడికి గురి అయినా పనిచేస్తున్నామని వారు అంటున్నారు. ఎక్కడో ఒకరిద్దరు తప్పులు చేసేవారు ఉంటారని, దాన్ని మొత్తం రెవిన్యూ వ్యవస్థ మీదకు నెట్టడం మంత్రి గారికి ధర్మం కాదని వారు గట్టిగానే చెప్పేశారు. ధర్మాన మాటలు తమకు బాధను కలిగించాయని కూడా అంటున్నారు.
అవినీతికి ఎవరొ పాల్పడినా తమ ఉద్యోగ సంఘాలు చూస్తూ ఊరుకోవని, తాము కూడా నిజాయతీగా పనిచేయాలనే ఉద్యోగులకు చెబుతామని వారు స్పష్టం చేశారు. మొత్తానికి నిబద్ధతతో పనిచేసే ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని ప్రసాదరావుకు వారు వినతి చేశారు.
ఇవన్నీ సరే కానీ పెద్దమనిషి అన్నీ తెలిసిన వారూ అయిన ప్రసాదరావు ఎందుకిలా మాట్లాడారు అన్న చర్చ ఇపుడు సాగుతోంది. ఆ శాఖను ఎవరో తెలుగుదేశం వారు చూడలేదు, నిన్నటిదాక ఆయన సొంత అన్న క్రిష్ణ దాస్ రెవిన్యూ మంత్రిగా పనిచేసారు. ఇక ప్రసాదరావు ఇంకా పని మొదలెట్టలేదు. ఆయన బయట విన్న మాటలో, లేక ఒకటి రెండు అనుభవాలో చూసుకుని మొత్తం రెవిన్యూ శాఖ అవినీతిమయం అంటే అది తనకే కాదు, తమ ప్రభుత్వానికి కూడా మచ్చ అని ఎందుకు గుర్తించలేకపోయారు అన్నదే ప్రశ్న.
మొత్తానికి కొత్త క్యాబినెట్ లో సీనియర్లలో ఒకరు, సమర్ధంగా పనిచేస్తారు అని అంతా ఆశిస్తున్న నేపధ్యంలో ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలు జగన్ సర్కార్ ని ఇరకాటంలోకి నెడుతున్నాయని అంటున్నారు. అసలే పీయార్సీ వివాదంతో సర్కార్ కి కాస్తా దూరం జరిగిన ఉద్యోగ వర్గాలను ఇపుడు మంత్రి కామెంట్స్ మరింతగా దూరం చేస్తున్నాయా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట.