Begin typing your search above and press return to search.
మంత్రి ప్రసాదరావును పట్టించుకోని కీలక నేతలు.. ఏం జరిగిందంటే!
By: Tupaki Desk | 21 April 2022 3:30 PM GMTఏపీలో తాజా మంత్రివర్గం.. జగన్ 2.0లో చోటు దక్కించుకున్న శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఎమ్మెల్యే.. సీని యర్ నాయకుడు.. ధర్మాన ప్రసాదరావుకు.. సొంత జిల్లాలోనే సెగ తగులుతోందని అంటున్నారు పరిశీల కులు. ఇటీవల మంత్రిగా నియమితులైన ఆయన తొలిసారి జిల్లాలో అడుగు పెట్టినప్పుడు.. ఆయన కు బిగ్ షాకే తగిలిందని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా జిల్లాలో ఒక నాయకుడు.. మంత్రి పదవిని దక్కించుకుని వస్తే. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు.
అదేసమయంలో సదరు మంత్రి కుటుంబ సభ్యుల్లోనూ ఆనందం ఉట్టిపడుతుంది. కానీ, దీనికి భిన్నంగా ప్రసాదారావు పరిస్థితి మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాకుమంత్రి అయి వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు ఆయన అనుచరులు... అభిమానులు పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహించారు. ఈ క్రమంలో సభకు అందరినీ రావాలని ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలకు ధర్మాన కీలక అనుచరులు ఫోన్లు చేశారు.
అయితే ఆ సమావేశానికి నరసన్నపేట.. ఆమదాలవలస నియోజకవర్గాల నాయకులు హాజరుకాలేదు. గత మూడేళ్లుగా పార్టీ.. ప్రభుత్వ పరంగా నిర్వహించిన ప్రతి చిన్న కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్య మంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే, అదీ కాకుండా.. ధర్మాన ప్రసాదరావు సొంత అన్నయ్య.. ధర్మాన కృష్ణదా స్.. స్పీకర్ తమ్మినేని సీతారామ్‌లు ప్రసాదరావు అభినందన సభకు రాలేదు. అంతేకాదు.. కనీసం వాళ్ల కుటుంబసభ్యులు.. అనుచరులను ఎందుకు పంపించలేదనేది ప్రశ్న.
ఇక, వారి పరిస్థితి అలా ఉంటే.. ధర్మాన ప్రసాదరావు కూడా.. తన ప్రసంగంలో ఎక్కడా కూడా వీరి ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం.. ముఖ్యమంత్రి జగన్‌నుకొనియాడేందుకు ప్రాదాన్యం ఇచ్చారు. ఇదే సమయంలో తన అన్నయ్య నిర్వహించిన రెవెన్యూ శాఖపై అవినీతి ఆరోపణలు చేశారు. ``అవినీతి లేని పాలన అందిద్దాం..`` అంటూ.. ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం.. మరింతగా గ్యాప్ పెంచింది. దీనిపై కృష్ణదాస్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ప్రసాదరావు అభినందన సభకు ధర్మాన కృష్ణదాస్ అనుచరుడిగా ముద్రపడ్డ డీసీసీబీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు వచ్చారు. వేదికపైకి పిలుస్తారేమోనని చాలాసేపు ఆయన కింద వెయిట్ చేశారు. కానీ.. ఎంతకూ పైకి పిలవకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆమదాలవలసలో తమ్మినేని వ్యతిరేకవర్గం యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లతో జోరుగా ఉంది. జిల్లాకు దశ దిశ లేని నాయకత్వం కాదు.. సత్తా కలిగిన నేత వచ్చారంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు.
వీటిని చూసిన పార్టీ కేడర్‌లో మరో చర్చ జరుగుతోంది. ఇది ఉద్దేశ పూర్వకంగా.. కృష్ణదాస్‌ను డ్యామేజీ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలు.. వైసీపీలో రాజకీయ రచ్చను ఎగదోస్తున్నాయి. నిజానికి అన్నదమ్ములు ఇద్దరినీ కూడా సీఎం జగన్ ఆదరించారు. వీరు మాత్రమే ఇలా ఎడమొహం.. పెడమొహంగా ఉన్నారని.. పార్టీ వర్గీయులు గుసగుసలాడుతున్నారు.
అధినేత జగన్ అంటే అభిమానం.. ప్రేమ చూపించే నేతలు.. అదే అధినేత ఎంపిక చేసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును లైట్ తీసుకుంటున్నారని.. ఇది మంచి పరిణామం కాదని. అన్నదమ్ములకు అతి సమీప నేతలు.. కేడర్ కూడా వ్యాఖ్యానిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉన్నందున.. వీరు ఇలా కుమ్ములాడుతుంటే.. పార్టీ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.