Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే రోల్ లో సైలెంట్ ! మంత్రి అయితే చాలు వైలెంట్ !
By: Tupaki Desk | 6 May 2022 6:30 AM GMTమంత్రి పదవి రాలేదు అని కొందరు బాధపడుతుంటారు. వచ్చాక చాలా కూల్ గా ఉంటారు. ఆ కోవలో రోజా ఉంటే అందుకు భిన్నంగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. గతంతో పోలిస్తే పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే రోల్ లో ఆయన పార్టీ ఏం చెబితే ఆ మేరకు మాట్లాడి వెళ్లేవారు. ఇప్పుడు స్టాండ్ మార్చి మాట్లాడుతూ పార్టీకి ఇంకొంత ప్లస్ గా నిలుస్తున్నారు. తన వైఖరికి భిన్నంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి విషయమై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రసంగాలు తప్ప బయటకు వచ్చి ఆయన మాట్లాడరు.. మాట్లాడలేదు కూడా !
ఓ సందర్భంలో మాత్రం చంద్రబాబు ను నిలువరించిన దాఖలా అయితే సెషన్ లో ఉంది.ఆ రోజు సింగపూర్ తో రాష్ట్రాన్ని పోలుస్తూ చంద్రబాబు చెప్పిన మాటలను ఖండిస్తూ కొన్ని విషయాలు చెప్పారు. అలానే సింగపూర్ తో టీడీపీ సర్కారు చేసుకున్న ఒప్పందాలపై కూడా కొన్ని విషయాలు చెప్పారు.
అవన్నీ గతం వాటిపై ఇప్పుడు చర్చ ఎందుకులే కానీ ధర్మాన మాత్రం ఇవాళ తన జిల్లా శ్రీకాకుళంకు చంద్రబాబు వచ్చి వెళ్లిన వెంటనే ప్రెస్మీట్ పెట్టారు. రిమ్స్ కు వెళ్లారు అక్కడా ఇవే మాటలు చెప్పారు. గార మండలం వెళ్లారు అక్కడ కూడా ఇవే మాటలు చెప్పారు. ఆ విధంగా సంక్షేమం అన్నది రాజ్యాంగ స్ఫూర్తి అని చెబుతూనే, ఆ రోజు ఉన్న చంద్రబాబు సర్కారును దుయ్యబట్టారు.
అంతేకాకుండా అభివృద్ధి గురించి చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని తేల్చేస్తూ జగన్-కు పూర్తి మద్దతుగా నిలిచారు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత స్పీడుగా లేరు. ప్రయివేటు సంభాషణల్లోనూ ఆయన పెద్దగా ఆసక్తిగా మాట్లాడేవారు కాదు. కానీ మంత్రి పదవి రాగానే ఆయన స్టైల్ మారిపోయింది. ఊళ్లో కాన్వాయ్ సందడి సందడిగా తిరుగుతోంది. ఇది కదా మార్పు అంటే !