Begin typing your search above and press return to search.

ధర్మానతోనే స్టార్ట్ : జాతకాలు తేల్చేసే టైమ్...?

By:  Tupaki Desk   |   5 Jun 2022 2:30 AM GMT
ధర్మానతోనే స్టార్ట్ : జాతకాలు తేల్చేసే  టైమ్...?
X
వైసీపీలో ఇపుడు మరో సరి కొత్త గుబులు పట్టుకుంది. ఎన్నికలు ఇంకా రెండేళ్ళ వ్యవధిలో ఉండగానే సర్వేల పేరుతో వైసీపీ పక్షాన ఐ ప్యాక్ టీమ్ చేస్తున్న హడావుడి ప్రజా ప్రతినిధులకు నిద్రపట్టనీయడంలేదు. ముందుగా ఉత్తరాంద్ర్హాలోని శ్రీకాకుళం జిల్లా నుంచే ఈ సర్వే మొదలుపెడుతున్నారు. అందునా మంత్రుల నుంచే ఈ సర్వేలు స్టార్ట్ చేస్తున్నారు.

ఇక రెవిన్యూ మంత్రి, సీనియర్ మోస్ట్ నాయకుడు అయిన ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచే ఐ ప్యాక్ టీమ్ సర్వే మొదలెట్టింది. ధర్మాన మూడేళ్లలో ఎమ్మెల్యేగా ఎలా పనిచేశారు. ఆయన సమస్యలను ఎలా పరిష్కరిస్తారు. ఆయన తరువాత పార్టీలో అంతటి స్థాయి నాయకులు వేరే ఉన్నారా. ఉంటే ఎవరు ఇలాంటి విషయాలతో సర్వే చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ధర్మాన మీద అపోజిట్ గా పోటీ చేసి ఓడిన టీడీపీ మహిళా నాయకురాలు గుండా లక్ష్మీ దేవి గ్రాఫ్ ఎలా ఉంది.

ఇపుడు ఆమె మళ్లీ పోటీ చేస్తే ఇవతల ధర్మాన ఉంటే విజయావకాశాలు ఎవరికి ఎలా ఉంటాయి. ఇది కూడా సర్వేలో ముఖ్య అంశంగా చేర్చుకుని అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇక నియోజకవర్గ సమస్యలు ఏంటి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతవరకూ పరిష్కారం అయ్యాయి. ప్రజలకు ఉన్న అసంతృప్తి ఏమిటి అది పార్టీ మీద నాయకుల మీద లేక ప్రభుత్వం మీద ఇలా ఈ సర్వే సాగుతోంది.

ఇదిలా ఉంటే ముందుగా మంత్రులు ఆ మీదట ఎమ్మెల్యేలు అన్న తీరున ఐ ప్యాక్ టీమ్ చేపడుతున్న ఈ సర్వే ఎమ్మెల్యేల గుండెలలో గుబులు రేపుతోంది. సర్వే నివేదికలు దగ్గర పెట్టుకుని మరీ పనితీరు ఆధారంగానే ఎవరికైనా టికెట్ ఇస్తాను అని ఇప్పటికే జగన్ ప్రకటించేశారు. దాంతో సర్వేలో కనుక పాస్ మార్కులు రాకపోతే ఎలా అన్న బెంగ ప్రజా ప్రతినిధులలో కలుగుతోంది.

మరో వైపు చూస్తే ఇంకా రెండేళ్లకు ఎన్నికలు ఉన్నాయి కదా ఇపుడు సర్వే అంటున్నారు అంటే ముందస్తు ఎన్నికలకు ఇది సంకేతమా అలా అయితే తమ పదవీ భాగ్యం లో చాలా మటుకు కత్తిరింపేనా. మళ్ళీ టికెట్ గెలుపు ఇక్కట్లూ ఇలా అన్నీ గుర్తుచేసుకుంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులు పరేషాన్ అవుతున్నారుట. మొత్తానికి ప్రశాంత్ కిశోర్ తో తెదదెంపులు చేసుకున్న వైసీపీ ఆయన ఆద్వర్యంలో నడిచే ఐ ప్యాక్ టీమ్ తో సర్వేలు జరిపిస్తూండడమే ఇక్కడ విశేషం. చూడాలి మరి ఈ సర్వే ఫలితాలు ఎలా వస్తాయో. ఆ మీదట వైసీపీ హై కమాండ్ తీసుకునే సంచలన నిర్ణయం ఎలా ఉంటుందో.