Begin typing your search above and press return to search.
హెలిక్యాప్టర్ వద్ద ఫొటో దిగితే మనదవుతుందా: మంత్రి జయరాం
By: Tupaki Desk | 18 Sep 2020 4:00 PM GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి జయరాం స్పందించారు. ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలున్న వ్యక్తి నుంచి తన కుమారుడు బెంజ్ కారు తీసుకున్నాడన్న విమర్శలపై నిప్పులు చెరిగారు.
మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ కు బర్త్ డే సందర్భంగా ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న ఏ14 కార్తీక్ నుంచి బెంజ్ కారు గిఫ్ట్ గా వచ్చిందని తాజాగా ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు..
ఈ ఆరోపణలను మంత్రి జయరాం ఖండించారు. అయ్యన్న ఆరోపణలు నిరాధారమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వర్ పక్కనున్న బెంజ్ కారు తమది కాదని స్పష్టం చేశారు. కారు పక్కన ఈశ్వర ఫొటో దిగాడని వివరించారు. హెలిక్యాప్టర్, రైలు పక్కన ఫొటోలు దిగితే అవి మనవే అవుతాయా అని మండిపడ్డారు. ఆ కారు తమదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి తనకేం సంబంధం లేదని మంత్రి జయరాం క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తనకు ఏమైనా పదవులు ఇచ్చారా అని జయరాం ప్రశ్నించారు.