Begin typing your search above and press return to search.
కాకాణి... ఆ కాస్తా ఆనందం... ?
By: Tupaki Desk | 18 April 2022 5:42 PM GMTరాక రాక వచ్చిన పదవి. అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తూంటే కాకాణి గోవర్ధనరెడ్డి మాత్రం వివాదాల్లో కూరుకుపోతున్నారా. ఏమో. అలాగే సీన్ ఉందిట. ఇలా ఆయన మంత్రి అయ్యారో లేదో రెండు రోజుల తేడాలో సొంత జిల్లా నెల్లూరు కోర్టులో చోరీ జరిగింది. పోయిన విలువైన వస్తువులు ఏంటి అంటే ఆయన మీద గతంలో మోపిన నకిలీ పత్రాల అభియోగం కేసులోని డాక్యుమెంట్లు అంటున్నారు.
అలా కాకాణి పెద్ద ఇరకాటంలో పడిపోయారు. నిజానికి ఈ చోరీ చాలా ఆశ్చర్యంగానూ సంచలనంగానూ ఇపుడు ఏపీ రాజకీయాలో మారిపోయింది. మంత్రి గారు ఈ విషయంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా విపక్షాలు ఆరోపణలు సంధిస్తున్నాయి. అయితే ఇందులో అసలు నిందితులు ఎవరు ఉన్నారో తెలియదు కానీ నెల్లూరు జిల్లాలోనూ బయట కూడా కాకాణి ప్రత్యర్ధులు అంతా ఏకమై విమర్శలు చేస్తున్నారు. కొత్త మంత్రి గారినే టార్గెట్ చేస్తున్నారు.
ఏపీ బీహార్ లా మారిపోయింది, కోర్టులో దొంగతనం జరగడమేంటి అని పీసీసీ చీఫ్ శైలజానధ్ అంటూంటే, ఈ కేసు మీద సీబీఐ విచారణ జరిపించలాని టీడీపీ సీనియర్ నేత ధూలిపాళ్ళ నరేంద్రనాధ్ డిమాండ్ చేస్తున్నారు. ఇది కోర్టు పవిత్రతకే మాయని మచ్చలాంటి వ్యవహారం అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ అంటున్నారు.
ఇక నెల్లూరు కోర్టులోని లాయర్లు అయితే చోరీ మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దానికి తోడు నెల్లూరు జిల్లా ఎస్పీ ఈ చోరీ మీద ఇచ్చిన వివరణ కూడా సరిగ్గా లేదని విపక్షాలు కస్సుమని లేస్తున్నాయి. ఇదంతా కూడా ఇపుడు మంత్రి కాకాణికి ఇరకాటంగా మారింది అంటున్నారు. సొంత పార్టీలో అసమ్మతులు ఒక వైపు కోర్టు చోరీ ఉదంతం విషయంలో ఏం జరిగిందో తెలియకపోయినా విమర్శలు వచ్చి పడుతూండడంతో మరో వైపు మంత్రి గారు తెగ పరేషాన్ అవుతున్నారుట.
మొత్తానికి జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నా మనసులో కాస్తంత సంతోషానికి చోటు లేని మంత్రిగా కాకాణి ఇపుడు ఉన్నారని అంటున్నారు. ఏపీలో విపక్షం మొత్తం నెల్లూరు జిల్లా కోర్టు చోరీ మీద ఫోకస్ పెట్టడంతో ఇప్పట్లో ఈ కాక చల్లారేలా లేదు, కాకాణికి కి ఈ తలపోటు వదిలేలా లేదు అని అంటున్నారు.