Begin typing your search above and press return to search.
కోర్టులో దొంగతనానికి నాకు సంబంధం లేదు.. మంత్రి కాకాణి కామెంట్స్
By: Tupaki Desk | 19 April 2022 5:04 PM GMTనెల్లూరు కోర్టులో ఫైల్స్ దొంగతనం జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఈ చోరీలోతాజాగా కేబినెట్‌లో చేరిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఉన్న కేసు పత్రాలే ఉన్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను కుదుపు వచ్చింది. అయితే.. తాజాగా దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కోర్టు ఫైల్స్ చోరీ వెనుక కుట్ర ఉందన్నారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను బద్నాం చేయడానికే... కోర్టులో ఫైల్స్ చోరీ జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు.
ఆరోపణ చేసేవారు సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు. సీబీఐ విచారణను తాను స్వాగతిస్తానన్నారు. ఆ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించిన కాకాణి.. పవన్ నటనకు మాత్రమే పనికొస్తారన్నారు. తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని.., పార్టీలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ``కోర్టులో చోరీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కోర్టులో చోరీ అంశంపై ఏ విచారణకైనా సిద్ధం. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు. హైకోర్టు స్థాయిలో కూడా విచారణ చేయించుకోవచ్చు`` అని కాకాణి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రభుత్వ విచారణ చేయించుకోవచ్చు నని చెప్పారు. ప్రభుత్వ విచారణ తర్వాత ఎలాంటి విచారణకైనా సిద్ధమని అన్నారు.. పవన్‌కల్యాణ్ నటనకే పనికొస్తారు తప్ప దేనికీ పనికిరారన్నారు. రాజకీయాల్లోనూ నటించాలని ఆయన కోరుకుంటే ఎవరూ ఏమీ చేయలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కోర్టు దొంగతనం.. అసలు జరిగింది ఇదే.
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు.
ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. 14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగత నం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించి న పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు. నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవనం వద్ద ఇనుము దొంగతనానికి వెళ్లి.. అది కుదరకపోవడంతో ప్రస్తుత కోర్టులో చోరీ చేశారని నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.