Begin typing your search above and press return to search.

ఏపీలో రేప్‌లు జ‌రిగితే.. టీడీపీ పండ‌గ చేసుకుంటోంది.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   4 May 2022 1:48 PM GMT
ఏపీలో రేప్‌లు జ‌రిగితే.. టీడీపీ పండ‌గ చేసుకుంటోంది.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు జరిగితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రణాళిక ప్రకారమే కొందరు వ్యక్తులను రెచ్చగొట్టి శాంతిభద్రతల లోపంగా ఎత్తిచూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి చెందినవారే అత్యాచారాలు, హత్యలు చేసి వారే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కాకాణి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎక్క‌డ అత్యాచారం జ‌రిగినా.. ఎక్క‌డ హ‌త్య జ‌రిగినా.. టీడీపీకి పండ‌గలా ఉంద‌న్నారు.

టీడీపీ అదినేత చంద్ర‌బాబు.. ఆపార్టీ ప‌ప్పు నాయ‌కుడు నారా లోకేష్‌లు.. ఎక్క‌డ శవాలు క‌నిపిస్తే.. అక్క‌డ వాలిపోతున్నార‌ని.. శ‌వ‌రాజ‌కీయాల‌కు ఎవ‌రైనా అవార్డులు ఇస్తే.. వాటిని.. ఫ‌స్ట్ తెచ్చుకునేది వీరేన‌ని ఎద్దేశా చేశారు. ఇప్ప‌టికైనా.. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగానే చేయాల‌ని.. శ‌వ‌రాజ‌కీయాలు మానుకోవాల‌ని.. కాకాణి హిత‌వు ప‌లికారు. కాగా, గడచిన మూడేళ్లలో 694 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారందరికీ ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందిందన్నారు. ఇదిలావుంటే.. సచివాలయంలో మంత్రి కాకాణి మాట్లాడుతున్న సమయంలో కరెంటు కోతల కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో మీడియా సమావేశాన్ని కొద్దిసేపు నిలిపివేశారు.

ఆర్బీకేల‌కు అవార్డులు!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితి ఫుడ్ ఆర్గనైజేషన్ అవార్డులకు ఎంపికయ్యాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. యూఎన్ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్బీకేలను నామినేట్ చేసిందని తెలిపారు. సీఎం జగన్ ఆలోచనల ప్రతిరూపకంగానే ఆర్బీకేలు ఏర్పాటు అయ్యాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు యూఎన్ ఛాంపియన్ అవార్డ్కు ఎంపిక కావటం గౌరవంగా ఉందన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదని కాకణి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందలేదని ఆయన ఆరోపించారు. పంటల బీమా కింద చంద్రబాబు పెట్టిన రూ.119 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు.