Begin typing your search above and press return to search.
బాబును తిట్టే ఊపులో జగన్ ను అవుడేటెడ్ అనేసిన ఏపీ మంత్రి
By: Tupaki Desk | 29 May 2022 2:44 PM GMTఅందుకే అంటారు.. మితిమీరిన ఆవేశం వద్దని. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసే వేళలో.. తెలీకుండానే ఆవేశం హద్దులు దాటేస్తుంటుంది. అయితే.. పైకి ఎంత ఆవేశ పడుతున్నా.. లోపల మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆ విషయంలో తాజాగా ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తప్పులో కాలేశారు. రెండు రోజులు సాగిన మహానాడు అనుకున్న దాని కంటే వైభవంగా సాగటంతో వైసీపీ నేతలు గొంతులు సవరించుకున్నారు. ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చేసి.. ఒక్కొక్కొరు ఒక్కో పాయింట్ తీసుకొని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు.
టీడీపీ మహానాడును నిర్వహిస్తున్న వేళలోనే ఏపీ అధికారపక్షం సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్రనను చేపట్టటం తెలిసిందే. మహానాడును తక్కువ చేసి చూపించే ప్రయత్నాన్ని ఇప్పటికే ఏపీ అధికారపక్షం నేతలు చేస్తున్నారు.
అధినేత లేకుండా నిర్వహిస్తున్న న్యాయభేరికి భారీగా ప్రజలు హాజరవుతున్నారని.. అలాంటప్పుడు బాబుతో సహా అందరూ కలిసి నిర్వహిస్తున్న మహానాడుతో పోలిస్తే.. తమ బస్సు యాత్రే సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. తమ సింహం రాకుంటేనే ఇలాంటి పరిస్థితి ఉందని.. అదే ఆయనే సీన్లోకి డైరెక్టుగా దిగితే.. మరెలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ మాటల హడావుడి ఇలా ఉంటే.. మంత్రి కారుమూరి గన్నవరం సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా మూడో రోజున ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. అక్కడ నుంచి గన్నవరానికి వచ్చింది. తర్వాత విజయవాడ బెంజ్ సర్కిల్ కు.. అక్కడ నుంచి గుంటూరు మీదుగా చిలకలూరి పేట.. అక్కడి నుంచి నరసరావుపేటలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు మాట్లాడారు.
ప్రతి ఒక్కరి లక్ష్యం చంద్రబాబే అన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. చంద్రబాబును తిట్టే ఊపులో.. తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి.. ‘అవుట్ డేటెడ్’అయ్యారన్నారు.
ఇదే మాటను ఒకసారి కాకుండా రెండుసార్లు ఆయన నోటి నుంచి రావటంతో.. అక్కడున్న వారు కాస్తంత తల పట్టుకున్న పరిస్థితి. అయితే.. మంత్రి ఉద్దేశంలో చంద్రబాబు అవుట్ డేటెడ్ అయ్యారని చెప్పే క్రమంలో పొరపాటున బాబుకు బదులుగా జగన్ మాట రావటంతో మంత్రిగారి ప్రసంగం పంటి కింది రాయిలా మారింది.