Begin typing your search above and press return to search.
పవన్ కి బాబు ఇచ్చే సీట్లు అవేనట.. ఎవరు చెప్పారంటే... ?
By: Tupaki Desk | 27 Feb 2022 12:43 PM GMTఅలూ లేదు, చూలూలేదు కొడుకు పేరు సోమ లింగం అన్నట్లుగా రాజకీయ విమర్శలు ఉంటున్నాయి. జనసేన టీడీపీ ఇంకా పొత్తు పెట్టుకోనేలేదు, అయితే అలాంటి ఆలోచనలు ఎక్కువగా వైసీపీ నేతలకే వస్తున్నాయి. ఈ ఇద్దరికీ పొత్తులను ఎపుడో ఫ్యాన్ పార్టీ నేతలు కుదిర్చేశారు. రెండు పార్టీలు ఒక్కటే అని ప్రచారం కూడా వీర లెవెల్ లో చేస్తున్నారు. అంతే కాదు, చంద్రబాబుకు పవన్ దత్త పుత్రుడు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు పొత్తు వార్తలను దాటి సీట్ల పంపకం దాకా కధను తెచ్చేశారు వైసీపీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు మాయలో పవన్ పడొద్దు అని ఒక శ్రేయోభిలాషిలా ఆయన చెబుతున్నారా లేక ప్రత్యర్ధిలా ఎకసెక్కం చేస్తున్నారా అన్నది ఆయనే చెప్పాలి కానీ పవన్ కి అయితే టీడీపీ గురించి బాబు వైఖరి గురించి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు.
పొత్తుల పేరిట చంద్రబాబు గూటికి పవన్ చేరితే ఆయనకు బాబు ఇచ్చేవి ఓడిపోయే సీట్లు మాత్రమే అని కొడాలి నాని అంటున్నారు. అలా పవన్ని బాబు వంచించి తన రాజకీయ పబ్బం గడుపుకుంటారు కాబట్టి జర భద్రం పవర్ స్టార్ అంటున్నారు కొడాలి. అంతే కాదు ఈ రోజు మిమ్మల్ని ఎత్తేస్తున్న టీడీపీ అనుకూల మీడియా మీ క్షేమం కోసం పాటు పడదు కాక పడదు అని జోస్యం కూడా చెబుతున్నారు.
వారెపుడూ చంద్రబాబు కోసమే పనిచేస్తారు, అందులో భాగంగానే పవన్ని ఎత్తుతున్నారని, ఇది గుర్తించాలని కూడా కోరుతున్నారు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పవన్ కి కొడాలి నాని పనిగట్టుకుని మరీ హిత వచనాలు చెప్పడమే విడ్డూరంగా ఉంది. వైసీపీ అంటే పవన్ మండిపోతూంటారు. వైసీపీ నేతలకూ పవన్ అంటే కోపం. మరి అలాంటి వేళ మీ క్షేమం కోసమే పవన్ ఇదంతా చెబుతున్నామని కొడాలి నాని చెప్పడం వెనక మతలబు ఏంటి అన్నదే చర్చగా ఉంది.
అంటే విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్, టీడీపీ కలిస్తే మాత్రం వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ చాలా గట్టిగానే షాకులు తగిలేస్తాయి అన్న లెక్కలేవో ఉన్నాయట. అందుకే నీ మేలు కోసమే అంటూ పవన్ని బాబుకు వేరు చేయాలని చూస్తున్నారని టాక్. అయినా పవన్ ఏమైనా రాజకీయాల్లో అమాయకుడా.
పైగా ఎనిమిదేళ్ళ రాజకీయ అనుభవం సంపాదించిన నేతగా ఉన్నారు. అంతే కాదు, చంద్రబాబు ఓడిపోయే సీట్లు ఇస్తే తీసుకుని బాబుకు వంత పాడేందుకు పవన్ రెడీగా ఎపుడూ ఉండరనే అంటున్నారు జనసైనికులు. మొత్తానికి చూస్తే పవన్ ఈ రోజు ఏపీలో హాట్ టాపిక్ అయ్యారన్నది మాత్రం వాస్తవం అంటున్నారు.