Begin typing your search above and press return to search.
బాబును తిట్టినా కమ్మోళ్లకు కొడాలి నానీ ఇష్టమేనా.. అదేనా ధైర్యం..!
By: Tupaki Desk | 6 Dec 2021 3:30 PM GMTఏపీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. నాని మాట్లాడే మాటలు ఇప్పుడు తూటాల్లో పేలుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు అన్నా... ఆయన తనయుడు లోకేష్ అన్నా కూడా కొడాలి నాని ఒక రేంజ్ లో బూతులు తిడుతున్నారు. అసలు నాని ప్రెస్ మీట్ వస్తుందంటే చాలు ఎలాంటి ? బూతులు ఉంటాయా ? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎదురు చూసే పరిస్థితి. చివరకు ప్రతిపక్ష నేతలు కూడా కొడాలి నానికి బూతులు మంత్రి అని పేరు పెట్టేశారు. తెలుగుదేశం పార్టీని అభిమానించే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని ఇప్పుడు ఆ కులానికి ప్రధానంగా టార్గెట్ అవుతున్నారు.
ఇటీవల తెలంగాణలో అదే కులానికి చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి ఒకరు నానిని భౌతికంగా నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై నాని మరింత రెచ్చిపోయారు. చంద్రబాబే ఇలాంటి నేతలను ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డ ఆయన తాను గుడివాడలో కమ్మ సంఘం మీటింగ్ పెడతానని.. తనపై విమర్శలు చేస్తోన్న కమ్మ నేతలు వస్తే ఎవరిని గుడ్డలూడదీసి కొడతారో ? గుడివాడ కమ్మ వాళ్లే డిసైడ్ చేస్తారని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
గుడివాడలో కమ్మ ఓటర్లు 20 వేలకు పైనే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీ వైపు ఉంటారన్న అంచనా ఉన్నా కూడా నాని ధైర్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ కమ్మల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లు ఉన్నా కూడా వారు నానికే ఓట్లు వేస్తుంటారు. పైగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ నాని అభిమానులే. ఇక్కడ నాని అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేర్వేరు కాదు.. ఒక్కటే. పైగా ఇక్కడ కాపు, ముస్లిం, ఎస్సీ వర్గాల ఓటర్లలో ఎక్కువ మంది నాని వెంటే ఉంటూ వస్తున్నారు.
అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ వాళ్లు కమ్మలను నానికి ఎంత దూరం చేయాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యమయ్యేలా లేదు. ఈ ఈక్వేషన్లు బాగా గెలిసిన నాని ఐ డోన్ట్ కేర్ అంటూ చంద్రబాబు, లోకేష్‌పై తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఏదేమైనా ఒకప్పుడు నందమూరి గడ్డగా ఉన్న గుడివాడ ఇప్పుడు కొడాలి అడ్డా అయిపోయింది.