Begin typing your search above and press return to search.

నిషిత్ చేసే ఆ పని మంత్రి నారాయణకు తెలియదట

By:  Tupaki Desk   |   11 May 2017 10:49 AM GMT
నిషిత్ చేసే ఆ పని మంత్రి నారాయణకు తెలియదట
X
ఏపీ మంత్రి నారాయణ తన కుమారుడు నిషిత్ మరణంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కంటిపాపలా పెంచుకున్న కుమారుడు చేతికి అందివచ్చిన సమయంలో దుర్మరణం పాలవడం ఆయన్ను కుంగిపోయేలా చేసింది. నిషిత్ ఇక లేడు అన్న వార్తతో ఆయన కుప్పకూలిపోయారు. లండన్ నుంచి ఇండియాకు వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు.

కాగా... నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడన్న విషయం తనకు తెలియదని... తెలిస్తే వారించేవాడినని కన్నీటితో అన్నారు. తనతో పాటు కలసి ప్రయాణించేటప్పుడు సాధారణ వేగంతోనే వెళ్లేవాడని... అందుకే ఈ విషయంలో నిషిత్ పై తనకెప్పుడూ అనుమానం రాలేదని అన్నారు. కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న నారాయణను ఆపడం ఎవరి తరం కాలేదు.

ర్యాష్ డ్రైవింగ్ కారణంగా పలువురు ప్రముఖుల పిల్లలు మరణించిన సందర్భాలున్నా కూడా ఇంతవరకు ఎవరూ ఇలా ప్రమాదానికి కారణం ర్యాష్ డ్రైవింగ్ అని అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ.. నారాయణ మాత్రం ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే నితీష్ మరణించాడన్నట్లుగానే అంటున్నారు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని నారాయణ కన్నీరుమున్నీరవుతున్నారు.