Begin typing your search above and press return to search.

నిషిత్ కారు ఎంత బ‌లంగా ఢీ కొట్టిందంటే?

By:  Tupaki Desk   |   10 May 2017 5:51 AM GMT
నిషిత్ కారు ఎంత బ‌లంగా ఢీ కొట్టిందంటే?
X
ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ మ‌ర‌ణం ఇప్పుడు అంద‌రిని క‌లిసివేస్తోంది. చిరుప్రాయంలోనే అత‌డికి నూరేళ్లు నిండిపోవ‌టంపై అత‌ని స‌న్నిహితులు.. బంధువులు.. తెలిసిన వారూ అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక‌.. జ‌రిగిన ప్ర‌మాదాన్ని ప్ర‌త్య‌క్షంగా పరిశీలిస్తే.. విస్మ‌య‌క‌ర విష‌యాలు చాలానే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు కారు వేగం చాలా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌క్కువ‌లో త‌క్కువ గంట‌కు 120 - 150 కిలోమీట‌ర్ల మ‌ధ్య‌లో కారు ప్ర‌యాణించి ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మెట్రో ఫిల్ల‌ర్‌ ను నిషిత్ కారు ఎంత వేగంగా ఢీ కొట్టింద‌న్న విష‌యాన్ని.. కారు దెబ్బ తిన్న తీరు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కారు ముందుభాగం మొత్తం నుజ్జు నుజ్జు కావ‌ట‌మే కాదు.. ప్ర‌మాద స‌మ‌యంలో ప్రాణాల్ని ర‌క్షించే ఎయిర్ బెలూన్లు సైతం ప‌గిలిపో్యాయి అంటే.. వేగ తీవ్ర‌త ఎంత‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు. అమిత‌మైన వేగంతో వెళుతున్న కారును కంట్రోల్ చేయ‌టంతో జ‌రిగిన త‌ప్పే.. ప్రాణాలు పోయేలా చేసింద‌న్న మాట వినిపిస్తోంది.

స్నేహితుడితో క‌లిసి రాత్రి రైడ్‌ కు వెళ్లిన నిషిత్‌.. అర్థ‌రాత్రి ఈదురుగాలులతో పెద్ద ఎత్తున వ‌ర్షం కురుస్తుండ‌టంతో కొద్దిసేపు ఒక స్నేహితుడి ఇంట్లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అనంత‌రం ఇరువురు స్నేహితులు క‌లిసి బ‌య‌లుదేరార‌ని.. జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ గుడి ద‌గ్గ‌ర‌కు చేరుకునే స‌రికి వారు ప్ర‌యాణిస్తున్న కారు కంట్రోల్ త‌ప్పి మెట్రో ఫిల్ల‌ర్ నెంబ‌రు 9ను బ‌లంగా ఢీ కొట్టిన‌ట్లుగా తెలుస్తోంది. తెల్ల‌వారు జాము స‌మ‌యంలో పెద్ద శ‌బ్దం వినిపించ‌టంతో అక్క‌డి మున్సిప‌ల్ సిబ్బంది ప‌రుగు ప‌రుగున ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.