Begin typing your search above and press return to search.
చప్పట్లు కొట్టాలని ఏపీ మంత్రి పిలుపు.. ఎందుకంటే?
By: Tupaki Desk | 1 Oct 2020 5:45 PM GMTఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రధాని మోడీ కూడా అభినందించారు. ఆ వ్యవస్థను ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రభుత్వ పాలనను ప్రతి ఇంటి ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు.
కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తాజాగా ఏపీ కేబినెట్ లోని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో హిట్ అయ్యిందని.. 126200మంది ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారని.. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలను సీఎం జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ ఉద్యోగులను అభినందించేందుకు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని ఏపీ ప్రజలను మంత్రి పెద్దిరెడ్డి కోరారు.
తమ ప్రభుత్వం పెన్షన్ ల ప్రక్రియను నిరంతరం చేసి 61,65,000 మందికి పింఛన్లు గత నెల వరకు ఇచ్చామని పెద్దిరెడ్డి తెలిపారు. ఐఏఎస్ లకు సైతం సచివాలయ వ్యవస్థపై శిక్షణ ఇస్తున్నారని కొనియాడారు.