Begin typing your search above and press return to search.
రాజీనామాకు సిద్దమంటూ పెద్దిరెడ్డి అదిరే సవాలు
By: Tupaki Desk | 11 April 2021 10:30 AM GMTసంచలన సవాలును విసిరారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాజాగా జరుగుతున్న తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే.. తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు రాజీనామా చేయటానికి సిద్ధమని.. మరి.. ఓడితే టీడీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. తాజాగా వైసీపీ నేతలతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అనూహ్యంగా ఈ కొత్త సవాలును తెర మీదకు తీసుకొచ్చారు మంత్రి. ప్రజాహిత కార్యక్రమాలే వైసీపీకి బలమన్న ఆయన ముఖ్యమంత్రి జగన్ తిరుపతి టూర్ రద్దు వెనుకున్న కారణాన్ని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం సభను రద్దు చేసుకున్నారని చెప్పారు.
సీఎం సభ రద్దు చేసుకోవటానికి వెనుక టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ విసిరిన సవాలుతోనే అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ బాబాయ్ వివేక హత్య కేసులో తమకు.. తమ వారికి సంబంధం లేదంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాణం చేస్తారా? అని సవాలు విసరటం.. తాను చేస్తున్నట్లుగా లోకేష్ ప్రమాణం చేయటం తెలిసిందే.
ఈ ప్రమాణం గురించి చర్చ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా సవాల్ ను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడితే 20 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పటం ద్వారా.. అదే హాట్ టాపిక్ గా మారాలన్న ఎత్తుగడతో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. లోకేష్ ప్రమాణం తెర వెనక్కి వెళ్లేలా చేయటమే పెద్దిరెడ్డి వ్యూహమన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.