Begin typing your search above and press return to search.
బాబును కన్ ఫ్యూజ్ చేస్తున్న రోజా ! నగరి నగారా !
By: Tupaki Desk | 8 Jun 2022 9:30 AM GMTవచ్చే ఎన్నికల్లో రోజా పై పోటీ చేసే అభ్యర్థి విషయమై తర్జనభర్జన పడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కొంత కాలంగా రోజా బాగా యాక్టివ్ గా ఇక్కడ ఉన్నారు. మొదట్లో జబర్దస్త్ షూటింగుల పేరిట దూరం అయినా ఇప్పుడు మాత్రం ఆమె ఫోకస్ అంతా నియోజకవర్గంపైనే ఉంది. పెద్దాయన పెద్దిరెడ్డి కి కూడా ఆమెపై కోపం పోయిన విధంగానే ఉంది.
వీలున్నంత వరకూ వైసీపీ జెండాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎగురవేయాలన్న పంతంలోనే రోజాతో సహా ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఈ క్రమంలో రోజా పై ఫైట్ కు ఒకనాటి అందాల నటి వాణి విశ్వనాథ్ సిద్ధం అవుతున్నారన్న వార్తలు వచ్చాయి. తనకూ ఈ ప్రాంతంపై పట్టు ఉందని ఆమె అంటున్నారని తెలుస్తోంది.
మరోవైపు గాలి ముద్దు కృష్ణమ కుటుంబం ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కుటుంబం నుంచి ముద్దు కృష్ణమ భార్య కానీ, ఆయన కొడుకులు కానీ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు.
వాస్తవానికి చిత్తూరు రాజకీయాల్లో అభ్యర్థులు ఎవ్వరైనా సరే పోటీ పెద్దిరెడ్డికీ, చంద్రబాబుకూ మధ్యనే అన్నవిధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని వెంటేసుకుని పెద్దిరెడ్డి రాజకీయాలు చేసినా, ఆ విధంగా కొంతలో కొంత రోజాను నిలువరించినా, పార్టీ పరంగా చూసుకుంటే ఎప్పటికైనా రోజాకు మద్దతు ఇవ్వాల్సింది ఆ పెద్దలే ! కనుక జగన్ నిర్ణయాను సారం పనిచేసే పెద్దిరెడ్డి లాంటి పెద్దలకు ఈ సారి రోజా గెలుపు కూడా సవాలు కానుంది.
ఇక రోజా కూడా ముందున్నంత వేగంగా లేరు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప మరీ అంత వివాదాల జోలికి పోవడం లేదు. కాస్త నడవడిలో కూడా జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. తమిళ మూలాలున్న ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలను వారి భాషలోనే ఆకట్టుకుంటూ, అందుకు భర్త సాయం తీసుకుంటూ ముందుకు పోతున్నారు.
స్థానిక ఎన్నికల్లో రోజా మాట నెగ్గలేదన్న మాట అటుంచితే చాలా వరకూ వైసీపీ ఆమెకు మంచి ప్రాధాన్యమే ఇచ్చింది. పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆమెకు మంచి ప్రాధాన్యమే ఇవాళ క్యాబినెట్లో ఉంది. కనుక రోజాపై ఎవరు పోటీచేసినా అది టీడీపీకే కాదు వైసీపీకి కూడా సవాలు కానుంది. ఇక బాబు కన్ఫ్యూజన్ వీడి ఎవరో ఒకరి పేరు కన్ఫం చేస్తే వాళ్లే నియోజకవర్గంలో చురుగ్గా కదిలి పార్టీ సిద్ధాంతాలను,పాలక పార్టీ వైఫల్యాలను బలంగా తీసుకుని పోగలరు. కానీ బాబు మాత్రం ఆఖరి నిమిషం వరకూ ఏదీ తేల్చేలా లేరు.