Begin typing your search above and press return to search.
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన పేర్నినాని
By: Tupaki Desk | 12 Nov 2021 1:51 PM GMTరాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని నానుడి. అవసరాలు, పరిస్థితులు, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మిత్రుత్వం, శత్రుత్వం రెండూ ఏర్పడుతాయి. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరూ అన్నదమ్ముళ్లా కలిసిమెలిసి ఉండేవారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుందని అందరూ అనుకున్నారు. ఇంతలోనే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య తలెత్తిన జలవివాదాలతో గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. నీళ్లు పంపకాల్లో మొదలైన లొల్లి వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లింది. ప్రస్తుతం వివాదానికి కాస్త పుల్ స్టాప్ పెట్టారని అనుకున్నారు. ఇప్పుడిప్పుడే సద్దుమణిగిందని అందరూ అనుకుంటున్న తరుణంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆజ్యానికి అగ్ని పోశారు.
సీఎం జగన్‌పై ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రా పాలకులు అన్నారని, ఈ రోజు జగన్ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నిధులు లేక జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఎద్దేవా చేసినవారే.. నేడు బిచ్చమెత్తుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో పాలన నడవాలంటే కేంద్రం నిధులు కావాలని, అందువల్ల కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పేర్నినాని కౌంటరిచ్చారు. మాటి మాటికి ఢిల్లీకెళ్తున్న సీఎం కేసీఆర్, ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. అవును ఏపీకి రావాల్సిన నిధుల కోసమే బిచ్చమెత్తుకుంటున్నామని చెప్పారు. బయట కాలర్ ఎగరేసి.. లోపల కాళ్లుపట్టుకునే అలవాటు జగన్‌కు లేదని చెప్పారు. స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ అనే నైజంతో జగన్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులున్నాయంటున్నారని, కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్మును అనుభవిస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్ని అప్పులు చేసిందో, బ్యాంకులను అడిగితే తెలుస్తుందన్నారు. జగన్ ఎప్పుడూ ఓకే నినాదంతో ముందుకు వెళ్తారని అన్నారు. అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుగా తెలంగాణ వైఖరి ఉందని పేర్నినాని తప్పుబట్టారు.