Begin typing your search above and press return to search.

మ‌రో సేఫ్ సీట్ వెతుక్కుంటున్న ఏపీ మంత్రి!

By:  Tupaki Desk   |   7 Oct 2022 6:21 AM GMT
మ‌రో సేఫ్ సీట్ వెతుక్కుంటున్న ఏపీ మంత్రి!
X
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నుంచి తొలిసారి 2019 ఎన్నిక‌ల్లో గెలుపొందారు.. మాజీ శ్రీరంగ నాథ రాజు. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి పితాని స‌త్య‌నారాయ‌ణ‌పై 13 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

ఎన్నిక‌ల్లో గెలిచిన మొద‌టిసారే వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో కీల‌క‌మైన గృహ‌నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగ‌నాథ రాజు చాన్సు కొట్టేశారు. క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు.. ఆయ‌న‌. జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్న ఏకైక క్ష‌త్రియుడిగానూ ఆయ‌న నిలిచారు.

అయితే వైఎస్ జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌వి పోయింది. క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎవ‌రికీ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. దీనిపై క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాస్త గ‌ట్టిగానే నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. కొంత‌మంది మంత్రులను సామాజిక స‌మీక‌ర‌ణాల రీత్యా జ‌గ‌న్ త‌న రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ కొన‌సాగించిన సంగ‌తి తెలిసిందే. అలా శ్రీరంగ‌నాథ‌రాజును కూడా కొన‌సాగిస్తార‌ని వార్తలు వ‌చ్చినా నిజం కాలేదు.

మంత్రివ‌ర్గంలో స్థానం కోల్పోయిన‌ప్ప‌టి నుంచి శ్రీరంగ‌నాథ‌రాజు చురుకుగా లేరు. పార్టీ క్యాడ‌ర్ కు కూడా అందుబాటులో లేర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. భీమ‌వరంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌కు ఆయ‌న హాజ‌రు కాలేదు. అందులోనూ అల్లూరి క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికే చెందిన వారే. ఈ నేప‌థ్యంలో శ్రీరంగ‌నాథ రాజును ఆహ్వానిస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా అవి నిజం కాలేదు.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీరంగ‌నాథ రాజు నియోజ‌క‌వ‌ర్గం మారాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆచంట‌లో కాపులు, శెట్టి బ‌లిజ‌ల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ వేవ్‌లో గెలిచారు త‌ప్ప అక్క‌డ కాపులు, శెట్టి బ‌లిజ‌లు కాకుండా వేరే వారు గెల‌వ‌డం సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సుర‌క్షితమైన సీటును ఎంచుకునే ప‌నిలో ఉన్నార‌ని టాక్.

క్ష‌త్రియుల జ‌నాభా ఎక్కువ ఉన్న ఉండి అసెంబ్లీ స్థానం నుంచి శ్రీరంగ‌నాథ రాజు పోటీ చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. లేదా న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే యోచ‌న‌లో ఉన్నార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉండి ఎమ్మెల్యేగా టీడీపీ త‌ర‌ఫున క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే న‌ర‌సాపురం నుంచి కూడా క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎంపీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు సీట్ల‌లో పోటీ చేస్తే విజ‌యం సాధించొచ్చ‌ని శ్రీరంగ‌నాథ రాజు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో శ్రీ రంగనాథ రాజు ప్ర‌జ‌ల నుంచి కాస్త గ‌ట్టిగానే నిర‌స‌న ఎదుర్కొంటున్న‌ట్టు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేపథ్యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మారాలని దాదాపు ఫిక్స్ అయ్యార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బరిలోకి దిగనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.