Begin typing your search above and press return to search.
గెలుపు కోసం కాళ్ల బేరానికైనా వెళదాం.. ఈ మాటలు అన్నది ఏపీ మంత్రులు
By: Tupaki Desk | 27 Sep 2022 4:36 AM GMTరాజకీయంగా కాసింత తేడా వస్తే వెనుకా ముందు చూసుకోకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నేతలుగా ఏపీ అధికారపక్షం వైసీపీ నేతలకున్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అలాంటి వైసీపీ నేతలు.. ఎన్నికల వేళ.. అందునా తమకు సానుకూలతలు లేని వేళలో ఎలా మాట్లాడతారు? ఎలా వ్యవహరిస్తారన్నది చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. గెలుపు వేళ.. ధీమాను ప్రదర్శిస్తూ.. తమ అధినేత జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేసే వారు.. కించిత్ తేడా వస్తే మాత్రం అందుకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారో తాజాగా వారు చేసిన వ్యాఖ్యల్ని వినాల్సిందే.
త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో జరగనుంది. ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని.. తమకు తిరుగులేని అధిక్యత.. అధిపత్యం ఉందన్న విషయాన్ని ఫ్రూవ్ చేయాలని పట్టుదలతో ఉంది అధికార వైసీపీ.
ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు.. సీదిరి అప్పలరాజు ఇతర నేతలు పాల్గొన్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సీతంరాజు సుధాకర్ ను వెంట పెట్టుకొని ప్రచారాన్ని స్టార్ట్ చేసిన వారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు విన్న వారంతా ఆశ్చర్యపోయే పరిస్థితి.
ఈ ఎన్నికల్లో విజయం సాధించటం తప్పనిసరిగా తేల్చిన వారు.. గెలుపు కోసం అవసరమైన కాళ్ల బేరానికి వెళదామన్నారు. ఈవ్యాఖ్యలు మంత్రి సీదిరి అప్పలరాజు నోటి నుంచి రాగా.. మరో మంత్రి ధర్మాన మాత్రం కాస్తంత సెటిల్డ్ గా మాట్లాడారని చెప్పాలి.
ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోకుంటే వైసీపీకి నష్టమన్న ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి గెలుపు ధీమాను ప్రదర్శించే వైసీపీ నేతలు.. తమ తీరుకు భిన్నంగా కాళ్ల బేరానికైనా సిద్దమనే మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.