Begin typing your search above and press return to search.
జలయుద్ధం: ఏపీ, తెలంగాణ మంత్రుల ఫైట్
By: Tupaki Desk | 30 Jun 2021 4:30 PM GMTతెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం ముదురుతోంది. కృష్ణా నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ మంత్రులు, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్నటి వరకు తెలంగాణ మంత్రులు నోరు పారేసుకోగా.. ఇప్పుడు ఏపీ మంత్రుల వంతు వచ్చింది. తెలంగాణ మంత్రులకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
-తెలంగాణ చర్యలు అడ్డుకుంటాం: మంత్రి అనిల్
తాజాగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలంగాణ తీరుపై మండిపడ్డారు. కేటాయింపులకు లోబడే కృష్ణా నదీ నీళ్లను వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ చర్యలను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో జలాలను వృథా చేస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. తెలంగాణ వ్యవహార శైలి కొంత కాలంగా చూస్తున్నామని శ్రీశైలం ప్రాజెక్ట్ నిండకూడదనే రీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
-విరుచుకుపడ్డ మంత్రి బొత్స
తెలంగాణ, ఏపీ జల వివాదంపై తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త ఘాటుగా తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. రాజకీయల లబ్ధి కోసం తెలంగాణ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అక్కడి ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులలా అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదన్న బొత్స, నీటి పంపకాల వివాదం అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. తమ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోలేదని.. ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని చెప్పారు.
ఇన్నాళ్లు తెలంగాణ నుంచి కనిపించిన వేడి ఇప్పుడు ఏపీ నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఏపీ మంత్రుల కౌంటర్లతో ఇప్పుడు వేడి రాజుకుంది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రంగ ప్రవేశం చేయడంతో ఈ వివాదం మరింతగా రగిలింది.