Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి కొడుకు పెళ్లితో.. రాష్ట్రానికి అంత ఆర్థిక నష్టమా?
By: Tupaki Desk | 12 Feb 2022 4:30 PM GMTఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే.. పెళ్లి జరగటానికి ఏపీ ఖజానాకు చిల్లు పడటానికి సంబంధం ఏమిటన్న సందేహం కలగొచ్చు. కానీ.. మొత్తం చదివితే విషయం మీకంతా అర్థమయ్యాక.. అవునుకదా? నిజమే కదా? అనుకోకుండా ఉండలేరు. తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు.. తమ సొంత రాష్ట్రానికి ప్రయాణం కట్టుకున్న వేళ.. వారి మొదటి ఆప్షన్ ఏపీఎస్ ఆర్టీసీ (తెలంగాణ ఆర్టీసీ కాదు సుమా) బస్సులో ప్రయాణించటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకిలా అంటే.. ఏపీ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే.. తాము కొనే టికెట్ ఆదాయంతో ఏపీ ఖజానాకు అంతో ఇంతో మేలు జరుగుతుందన్న భావనను కొందరు వ్యక్తం చేస్తుంటారు.
విభజన తర్వాత దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఏపీకి తమ వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలని ప్రతి ఆంధ్రుడు అనుకుంటూ ఉంటారు.మరి.. అలాంటి వేళ.. ఏపీకి పాలకులుగా ఉన్న ఏపీ మంత్రి ఇంకెంతగా ఆలోచించాలి? తాజాగా ముగిసిన మంత్రి బొత్స వారి కొడుకు పెళ్లి విషయాన్నే తీసుకుందాం. ఏపీ నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా విమాన ప్రయాణం ద్వారా హైదరాబాద్ కు చేరుకొని ఉంటారు.
టికెట్ మొదలు.. క్యాబ్ ఛార్జీలు.. స్టార్ హోటళ్లలో బస..ఖరీదైన పెళ్లి సందడి.. ఇలా చెప్పుకుంటే కోట్లాది రూపాయిల ఖర్చు మొత్తం తెలంగాణ ఖాతాలోనే నమోదు అయ్యే పరిస్థితి. ఇవాల్టి రోజున మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికి జీఎస్టీ పేరుతో వడ్డించే పన్ను.. దాని ఆదాయపు వాటా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి వస్తుందన్న సంగతి తెలిసిందే.
ఈ లెక్కన చూసినప్పుడు మంత్రి బొత్స సత్యానారాయణ గారి ఇంట్లో జరిగిన పెళ్లి సందడిలో సింహభాగం మాదాపూర్ హైటెక్స్ లోనే జరిగింది. దీనికి వచ్చిన వందలాది బంధువులు.. పార్టీ కార్యకర్తరలు.. స్నేహితులు.. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది దీనికి హాజరయ్యారు. ఈ ఖర్చుకు సంబంధించిన పన్ను ఆదాయం మొత్తం తెలంగాణ బొక్కసానికే తప్పించి.. ఏపీకి చిల్లు కాసు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు చెప్పండి.. మంత్రి బొత్స వారింట్లో పెళ్లి ఏమో కానీ ఏపీకి రెవెన్యూ పరంగా భారీ లాస్ అన్న మాట పెళ్లికి వచ్చిన కొందరు మాట్లాడుకోవటం గమనార్హం.