Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ అధికారులు

By:  Tupaki Desk   |   8 Jan 2021 2:04 PM GMT
నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ అధికారులు
X
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టు ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో గత ఏడాది కాలంగా చూశాం.. టీడీపీ హయాంలో నియామకమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ స్థానిక ఎన్నికలను మొదట వాయిదా వేయడం.. సీఎం జగన్ ఆగ్రహించి ఆయనను తొలగించడం.. ఆ తర్వాత కోర్టుల్లో పంచాయితీ జరిగి తిరిగి నియామకం అయ్యారు.

అయితే ఈ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి కూడా పొందారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.. హైకోర్టు ఆదేశానుసారం ఏపీ ఉన్నతాధికారులు తాజాగా నిమ్మగడ్డతో భేటి అయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో తలమునకలై ఉందని వివరణ ఇచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా పోలింగ్ తరహాలోనే జరపాలన్న కేంద్రం గైడ్ లెన్స్ ను వివరించినట్లు సమాచారం.

ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని దఫదఫాలుగా చేపట్టామని ఎస్ఈసీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ చర్యలను ఎస్ఈసీకి వివరించినట్టు చెబుతున్నారు.

కాగా ఈ నెలలోనే కేంద్రం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశముందని.. అందుకే ఫిబ్రవరిలో ఎన్నికలు చేపట్టడం సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం.