Begin typing your search above and press return to search.
ఏపీ సొంత ఇన్‌కమ్.. ఏడాదికి 60 వేల కోట్లు తగ్గలేదు: కేంద్రం..
By: Tupaki Desk | 22 Dec 2021 4:46 AM GMTఏపీ ప్రభుత్వ ఆదాయంపై రాష్ట్ర సర్కారు ఇటీవల కాలంలో బీద అరుపులు అరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చినప్పుడు.. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కీలక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు.. మనకు కరోనా ఎఫెక్ట్ పడిందని.. ఆదాయం తగ్గిపోయిందని.. బీద పలుకులు పలికారు. దీంతో ఉద్యోగులు కూడా నిజమేనని అనుకున్నారు. కానీ, వాస్తవానికి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ ఆదాయంపై లెక్కలు పక్కాగా వివరించేసింది.
ఏపీకి సొంత వనరుల నుంచి ఆదాయం పెద్దగా తగ్గలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత 6 బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను, పన్నేతర మార్గాల నుంచి మొత్తం రూ.4,76,741 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.3,31,531 కోట్లు వచ్చింది. అంటే ఆరేళ్లలో అంచనాల్లో సగటున 69.54% ఆదాయం వచ్చినట్లు వెల్లడైంది.
గత మూడేళ్లలో రాష్ట్ర సొంత వాస్తవ ఆదాయం ప్రతి ఏటా రూ.60 వేల కోట్లను దాటింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.62,427 కోట్లు రాగా, 2019-20లో రూ.60,916 కోట్లు, 2020-21లో రూ.60,687 కోట్లు వచ్చిందని సభలో మంత్రి వెల్లడించారు.
అంతేకాదు.. కరోనా కారణంగా ఆదాయాలు భారీగా పడిపోయాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దానిలో వాస్తవం లేదనే చెప్పారు. 2019-20, 2020-21 మధ్య ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయ వనరుల్లో రూ.229 కోట్ల తగ్గుదలే కనిపించింది. ఇదే సమయంలో కేంద్రం నుంచి పన్నులు, ఇతర సాయాల రూపంలో వచ్చిన ఆదాయం రూ.16,087.58 కోట్లు పెరిగిందని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి పన్నుల వాటాలు, కేంద్ర సాయం, రుణాలు, అడ్వాన్సుల రూపంలో ఏపీకి రూ.4,07,488 కోట్లు, తెలంగాణకు రూ.2,99,811 కోట్లు అందాయి. గత ఆరేళ్లలో మూడేళ్లు రాష్ట్ర సొంత ఆదాయం కంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులే అధికంగా ఉన్నాయి. విభజన అనంతరం కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వనరుల్లో పన్నుల వాటా కింద రూ.1,92,641.43 కోట్లు, కేంద్ర సాయం కింద రూ.2,02,393.61 కోట్లు... రుణాలు, అడ్వాన్సుల కింద రూ.12,450.21 కోట్లు వచ్చిందని మంత్రి వివరించారు.
సో.. దీనిని బట్టి.. రాష్ట్రంపై కరోనా ప్రభావం లేదనే విషయం, ఆర్థికంగా నష్టపోయామనే విషయం.. ఎక్కడా కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మంత్రి బుగ్గన, సలహాదారు సజ్జల ఏం చెబుతారు? అనేది వీరి ప్రశ్న. ఇంకా ఎన్నాళ్లు.. ప్రజలకు మాయ మాటలు చెబుతారని అంటున్నారు.