Begin typing your search above and press return to search.

ప‌రిష‌త్ పోరులో సైకిల్ ప‌రుగు ఎందాక‌...?

By:  Tupaki Desk   |   18 Sep 2021 6:30 AM GMT
ప‌రిష‌త్ పోరులో సైకిల్ ప‌రుగు  ఎందాక‌...?
X
మ‌రో 24 గంట‌ల్లో రాష్ట్రంలో జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. గ‌త మార్చి నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఫ‌లితం విడుద‌ల‌పై హైకోర్టు సింగిల్ జ‌డ్జి.. ఇచ్చిన స్టే.. కార ణంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌లితాలు రాలేదు. అప్ప‌ట్లో కొన్ని ప‌రిష‌త్ స్థానాలు ఏక‌గ్రీవం కావ‌డంపై.. టీడీపీ అధి నేత చంద్ర‌బాబు స‌హా.. జ‌న‌సేన నేత‌లు.. హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌లితంపై స్టే వ‌చ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు.. ఎన్నిక‌ల‌కు మధ్య క‌నీసం గ్యాప్ లేద నేది మ‌రో వాద‌న‌గా ఉంది. అయితే.. మొత్తానికి తాజాగా ఈ స్టేను హైకోర్టు ఎత్తేసింది. దీంతో ఫ‌లితాల వెల్ల‌డికి మార్గం సుగ‌మ‌మైంది.

ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌.. ఫ‌లితాల వెల్ల‌డికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ‌పై యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీంతో ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కే ప‌రిష‌త్ ఫ‌లితం మొద‌లు కానుంది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఏంటి? పుంజుకుంటుందా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అంటే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌రిస్థితి చూసుకుంటే.. టీడీపీ స్థాని క ఎన్నిక‌ల్లో తీవ్రంగా దెబ్బ‌తింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టు సాధించ‌లేక పోయింది. ఇక‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ.. భారీ ఎత్తున ప్ర‌చారం చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితం.. టీడీపీని ఊరిస్తోంది.

వాస్త‌వానికి.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్‌కు.. ఎన్నిక‌కు మ‌ధ్య గ్యాప్ లేద‌నేది వాస్తవం. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనూ ఎన్నిక‌లు జ‌రిగిపోయాయి. దీంతో చాలా చోట్ల అభ్య‌ర్థులు ప్ర‌చారం కూడా చేసుకోలేక పోయారు. మ‌రోవైపు ఎన్నిక‌ల‌ను ఆపాలంటూ.. హైకోర్టులో పిటిష‌న్లు ప‌డ‌డంతో అభ్య‌ర్థుల్లో ఒక విధ‌మైన గంద‌ర‌గోళం నెలకొంది. దీంతో ఆశించిన మేరకు టీడీపీ నాయ‌కులు కానీ, వైసీపీ నాయ‌కులు కానీ... ప్ర‌చారం చేసుకోలేక పోయార‌నేది వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు ప‌ట్టున్న జిల్లాల్లో గెలుస్తామ‌ని.. టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. కానీ, వైసీపీ దూకుడు ముందు.. టీడీపీ ఏమేర‌కు పుంజుకుంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. మ‌రి టీడీపీ పుంజుకుంటుందా? చ‌తికిల ప‌డుతుందా? అనేది వేచి చూడాలి.