Begin typing your search above and press return to search.

ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   21 May 2021 5:37 AM GMT
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
X
ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. అలాగే , ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిషత్‌ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని న్యాయస్థానం చెప్పింది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎల‌క్ష‌న్ కోడ్‌ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎస్.ఈ.సీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి,లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్‌ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఎన్నిక‌లు ర‌ద్దు చేస్తూ, తీర్పు వెలువ‌రించారు. ఇక ఈ తీర్పు పై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. అలాగే ఈ హైకోర్టు తీర్పు ను సుప్రీం లో ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.