Begin typing your search above and press return to search.

వైసీపీ స‌ర్కారు ఎఫెక్ట్‌.. ప్ర‌జ‌లు ఇలా డిమాండ్ చేస్తారేమో!

By:  Tupaki Desk   |   16 Dec 2021 7:34 AM GMT
వైసీపీ స‌ర్కారు ఎఫెక్ట్‌.. ప్ర‌జ‌లు ఇలా డిమాండ్ చేస్తారేమో!
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పాల‌న జ‌రుగుతోంది. గ‌త రెండున్న‌రేళ్లుగా ఏపీ స‌ర్కారు.. అనేక సంక్షేమ కార్య‌క్ర మాలు అమ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఖ‌జానా ఖాళీ అవుతున్నా..కూడా నాయ‌కులు మాత్రం మేం హామీ ఇచ్చాం క‌నుక‌.. వాటిని అమ‌లు చేస్తున్నాం..అనే మాట చెబుతున్నారు. దీనికి సంబంధించి.. గ‌త ఎన్నిక ల‌కు ముందు.. ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తున్నారు. బాగానే ఉంది.

అయితే.. అలివికాని హామీలు ఇవ్వ‌డం ఒక నేర‌మైతే.. వాటిని అమ‌లు చేసేందుకు.. అప్పులపై అప్పులు తేవ‌డం.. రాష్ట్రాన్ని కూడాతాక‌ట్టు పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి మ‌రింత నేర‌మ‌ని అంటున్నారు ప‌రి శీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధికి మించి అప్పులు చేస్తోంద‌ని.. అంటున్నారు. మూడు సంవ త్స‌రాల్లో చేయాల్సిన అప్పును ఏడాదిలోనే చేయ‌డం.. అక్క‌డే.. కార్పొరేష‌న్ల ద్వారా కూడా అప్పులు తీసు కోవ‌డం.. బ్యాంకుల నుంచి కూడా భారీ ఎత్తున రుణాలు సేక‌రించ‌డం.. తెలిసిందే.

ఇవ‌న్నీ.. చాల‌వ‌న్న‌ట్టుగా.. స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌ల వ‌ద్ద దాచుకున్న సొమ్మును కూడా ప్ర‌భు త్వం తీసుకోవ‌డం.. ఇప్పుడే.. వైసీపీ పాల‌న‌లోనే చూస్తున్నామ‌ని.. ప‌లువురు పేర్కొంటున్నారు. ఇక‌, కేంద్రం నుంచి కూడా అప్పుల‌పై అప్పులు తెస్తున్నారు. అప్పుల కోసం.. కేంద్రం పెట్టిన ప్ర‌తిష‌ర‌తునూ అంగీక‌రిస్తున్నారు. అంటే.. మొత్తంగా రాష్ట్రంలో అభివృధద్ధి స్థానంలో అప్పులు.. చేరాయ‌నే వాద‌న మేధావుల నుంచి వినిపిస్తోంది.

ఎక్క‌డైనాఏ ప్ర‌భుత్వ‌మైనా.. అప్పుల‌నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. కానీ, ఏపీ ప్ర‌భుత్వం అప్పు నుంచి అప్పులోకి.. అన్న‌ట్టుగా రోజు రోజుకు అప్పులపాల‌వుతూనే ఉంది. అందుకే.. ఇప్పుడు.. ఢిల్లీలో ఆంధ్ర ప్ర‌దేశ్ అనే బ‌దులు.. అప్పుల ప్ర‌దేశ్ అనే మాట వినిపిస్తోంద‌ని.. వైసీపీ ఎంపీలే ఆఫ్ దిరికార్డుగా చ‌ర్చించుకుంటున్నారు.

దీంతో ఇప్పుడు.. ఏపీ ప్ర‌జ‌లు ఒక స‌రికొత్త డిమాండ్‌ను తెర‌మీదికి తెస్తున్నారు. అదేంటంటే.. మ‌రో రెండు న్న‌ర నెల్ల‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ ద‌ఫా.. వైసీపీ మేనిఫెస్టోలో న‌వ‌రత్నాల‌తోపాటు.. అప్పుల విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించాల‌నే డిమాండ్ వ‌స్తోంది. అంటే.. మేం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇంత అప్పులు చేస్తాం. ఇంత‌కు మించి చేయం.. అనే హామీని ప్ర‌జ‌ల‌కు ముందుగానే ఇవ్వాల‌ని.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇది క‌నుక‌.. ప్ర‌జ‌ల్లో విస్త‌రిస్తే.. ఏ పార్టీకైనా.. ఇది ప్ర‌ధాన ఇబ్బందిగామారే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన‌ప్పుడు.. మీరు ఎంత అప్పు చేస్తారో.. చెప్పండి? అని ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తే.. ఇబ్బందే క‌దా?? అంటున్నారుప‌రిశీల‌కులు. మ‌రి వైసీపీ ఎఫెక్ట్‌కు ఆమాత్రం ప్ర‌జ‌ల్లోనూ చైత‌న్యం కావాలిగా! అంటున్నారు ప‌రిశీల‌కులు.