Begin typing your search above and press return to search.
పసుపు బోర్డు పంచ్ సరిపోలేదా? మంత్రి పదవి మాట అవసరమా రఘునందనా?
By: Tupaki Desk | 5 April 2021 4:47 AM GMTమాట ఇస్తే.. దాని కోసం కట్టుబడి ఉండటం.. దాన్ని సాధించే వరకు విశ్రమించటం లాంటి లేకుండా.. చెప్పింది పూర్తి చేయటం మాటలు చెప్పినంత సులువు కాదు. అదేం సిత్రమో కానీ.. బీజేపీ నేతల నోటి నుంచి హామీగా వస్తే.. అదెప్పటికి పూర్తికాని కలగా మారుతుందన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. విభజన వేళ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీనే హామీ ఇవ్వటం.. ఆ తర్వాత తూచ్ అనటం తెలిసిందే.
రాష్ట్రం ఏదైనా కావొచ్చు.. నోరు ఊరే హామీలు ఇవ్వటం.. ఆ తర్వాత లైట్ తీసుకోవటం కమలనాథులకు కామన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నారు. ఆమెకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన రఘునందన్ ప్రచారాన్నినిర్వహించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే.. కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే తిరుపతి డెవలప్ మెంట్ మరింత వేగవంతమవుతుందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేధావుల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
రఘునందన్ లాంటి వారి నోటి నుంచి ఈ తరహా హామీలు రావటం ఆసక్తికరమని చెప్పాలి. ఎందుకంటే..బీజేపీ నేతలు ఇచ్చే హామీలతో ఏమీ కాదన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ ఎంపీ అరవింద్ తాను గెలిస్తే.. పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని.. అది కూడా మూడు రోజుల్లో అన్నప్పటికీ.. నేటికి సాధ్యం కాలేదు. భవిష్యత్తులోనూ సాధ్యం కాదు. ఇలా చెప్పే మాటలకు.. జరుగుతున్న పనులకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు..ఆమె కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందన్న హామీ ఆ పార్టీ ఇమేజ్ ను మరింత పలుచన చేస్తుందన్న మాట వినిపిస్తోంది.