Begin typing your search above and press return to search.
యువగళం సరే.. హామీలే ఇంపార్టెంట్ లోకేషన్నా!
By: Tupaki Desk | 28 Dec 2022 12:30 PM GMTయువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. మొత్తం 400 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ ఇంకా రెడీ కానప్ప టికీ.. ట్రైలర్‌గా అయితే.. జెండా ఆవిష్కరించారు. ఒక ప్రొమో కూడా రిలీజ్ చేశారు. అదేసమయంలో 4000 కిలో మీటర్లు ఈ యాత్ర సాగుతుందని కూడా వెల్లడించారు.
ఇక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభించే పాదయాత్ర దాదాపు గ్రామీణ ప్రాంతాల మీదుగా సాగుతుందని అంటున్నారు. ఇక, ఇప్పటి వరకు నేతలు ప్రకటించినదానిని చూస్తే.. నారా లోకేష్ యువతను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
వచ్చే 2024 నాటికి రాష్ట్రంలో 20 లక్షల కొత్త ఓటర్లు వస్తున్నారని.. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశం.
సో.. అందుకే.. నారా లోకేష్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కేవలం పాదయాత్ర వరకు మాత్రం లోకేష్ పరిమితమయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన పార్టీకి అధ్యక్షుడు కారు. పైగా.. చంద్రబాబు అధినేతగా ఉన్నారు. కాబట్టి పాదయాత్రలో ఎవరికీ ఎలాంటి హామీలు ఇచ్చే ఛాన్స్‌లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే.. గతంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. అనేక మంది సమస్యలు చెప్పుకొనేందుకు ఆయన వద్దకు వచ్చారు. వీరిలో ఉద్యోగులు.. మహిళలు, యువత, విద్యార్థులు ఉన్నారు ఈ క్రమంలో జగన్ వారందరికీ తాను అధికారంలోకి వస్తే.. ఇది చేస్తా.. అది చేస్తా.. అనే హామీలు గుప్పించారు. ఇప్పుడు చేశారా? లేదా? అనేది కాదు.. అప్పుడు హామీ ఇచ్చారు కనుక.. జగన్‌కు గంపగుత్తగా ఓట్లుపడ్డాయి.
మరి.. ఇప్పుడు లోకేష్ ఇలా హామీలు ఇచ్చే పరిస్థితి ఉందా? అనేది ప్రశ్న.ఇప్పటికైతే లేదు. ఎందుకంటే.. పార్టీకి సంబంధించిన కీలక వ్యహారాలు, మేనిఫెస్టో అన్నీ కూడా చంద్రబాబు చూస్తున్నారు. సో.. ఈ క్రమంలో నారాలోకేష్ యువతలో ఎలాంటి భరోసా నింపుతారు? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. ఆయన కనుక నమ్మకం కలిగించగలిగితే.. తిరుగులేనిశక్తిగా మాత్రం మారడం ఖాయమే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.