Begin typing your search above and press return to search.
ఏపీ జనం.. ఎవరి పక్షం... ?
By: Tupaki Desk | 22 Oct 2021 2:30 AM GMTఏపీ రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. వారూ వీరూ లేకుండా అంతా బజారున పడ్డారు. నేతలంతా కలసి తమ పరువును తామే తీసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఇలాంటి పాలిటిక్స్ ఎక్కడా లేదనే చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీ బాధ్యత మరచిపోతే విపక్షంగా ఉన్న వారు సైతం హద్దులు దాటేస్తున్నారు. దీనికంతటికీ కారణం రాజకీయ పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోవడమే. అత్యధిక మెజారిటీని సాధించి ఒక రాష్ట్రాన్ని ఏలుతున్న యువ ముఖ్యమంత్రి మీద అనరాని మాట వైరి పక్షం అంటే జనాల్లో రియాక్షన్ ఆశించిన స్థాయిలో వచ్చిందా అంటే జవాబు సందేహమే.
అదే సమయంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద జరగకూడని దాడులు జరిగితే ఏపీ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యో అని అన్నారా, సానుభూతి వెల్లువలా వచ్చిపడిందా అంటే మళ్ళీ డౌటే వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది. అసలు ఏపీ పాలిటిక్స్ లో జరుగుతున్నది ఏంటి అన్నదే ఇక్కడ పాయింట్. నేల విడిచి సాము చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రజా సమస్యలను పక్కన పెడితే కూడా రిజల్ట్ అచ్చం ఇదే తీరున ఉంటుంది. జనాలు తమ గురించి ఆలోచిస్తేనే స్పందిస్తారు. అంతే తప్ప తమకు సంబంధం లేని విషయాలను ముందు పెట్టి తమ పేరు చెప్పి రచ్చ చేస్తే ఊరుకుంటారా.
మరో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడా రాజకీయాలు వేడిగానే ఉంటాయి. కుర్చీ వ్యామోహం కూడా బాగానే ఉంటుంది. కానీ వాటికి మించి రాష్ట్రం పట్ల ఒక బాధ్యత కూడా వారిలో ఉందని చెప్పాలేమో. పొరుగున ఉన్న తమిళనాడు విషయమే తీసుకుంటే కేంద్రం నుంచి సాధించాల్సిన ప్రాజెక్టుల విషయంలో అంతా ఏకమవుతారు. రాష్ట్రానికి ఒక పైసా అభివృద్ధి మిగిలిపోయినా అంతా ఒక్కటై పోరాడుతారు. ఇక దేశంలో తమ రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడాలన్న ఆరాటం, తపన కూడా అక్కడ పార్టీలకు ఉంది.
అంతదాకా ఎందుకు ఏడేళ్ళ దాకా కలసి ఉన్న తెలంగాణాలో కూడా ఎంతో కొంత రాజకీయ ఐక్యత కనిపిస్తుంది. ఈ మధ్యనే జరిగిన క్రిష్ణా జలాల వివాదంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒకే లైన్ మీదకు వచ్చాయి. ఒకే వాయిస్ వినిపించాయి. అదే సమయంలో ఏపీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తలో మాట అంటూ వచ్చాయి. కొన్ని పార్టీలైతే వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యాయి. ఇలా చేయడం వల్ల జనాలకు జరిగే మేలు ఏంటి అన్నది ఎవరైనా ఆలోచించారా. ఇక ఏపీలో అధికార విపక్షాలు అన్నీ కూడా ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేయాలి. అయిదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చిన రెండవ వారు సలహా సూచనలు ఇచ్చి రాష్ట్ర ప్రగతిని కోరుకోవాలి. కానీనిజానికి అలా జరుగుతోందా.
దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో అభివృద్ధి పనులను ఆపేందుకు కోర్టులకు వెళ్తున్నారు అని అధికార పక్షం ఆరోపిస్తోంది. మరి విపక్షాలను ఏ విషయంలో అయినా విశ్వాసంలో తీసుకోవాలని పవర్ లో ఉన్న వారు ఎందుకు ఆలోచన చేయడంలేదు. ఏపీ కొత్త రాష్ట్రం, బాగా చితికిపోయిన రాష్ట్రం. విభజన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. ప్రత్యేక హోదా అన్న దాన్ని సాధించుకోలేకపోయారు. అప్పులు మీరు చేశారు, అంటే మీరు చేశారు అని నిందించుకుంటున్నారు, కానీ అసలు ఇంతలా అప్పులు పేరుకుపోవడానికి కారణం కేంద్రం నుంచి ఆర్ధిక సాయం సరిగ్గా అందడంలేదు అన్న ఆలోచన ఉందా. దాని కోసం అంతా కలసి ఉద్యమించాలన్న ధ్యాస ఉందా. ఏపీలో ఎన్నో సమస్యలు ఉంటే కొత్తగా ఆందోళన పేరిట అకారణ బంద్ లు దీక్షలు చేస్తే జనాల మద్దతు ఎలా ఉంటుంది. అందుకే జనాలు సైలెంట్ గా అన్నీ చూస్తున్నారు. వారు ఎవరి పక్షమూ కాదు, అసలు ఉండనక్కరలేదు కూడా. రాజకీయ పార్టీలే ప్రజా పక్షం రావాలి. అలా వచ్చిన నాడు బూతు పురాణాలు అవసరం లేదు, దాడుల దారులు అంతకంటే అక్కరలేదు. మరి ఏపీలో అలాంటి వాతావరణం వస్తుందా. వెయిట్ అండ్ సీ.