Begin typing your search above and press return to search.

బుల్డోజ‌ర్ ఎఫెక్టులు ఎలా ఉంటాయంటే ?

By:  Tupaki Desk   |   22 Jun 2022 12:30 AM GMT
బుల్డోజ‌ర్ ఎఫెక్టులు ఎలా ఉంటాయంటే ?
X
ఆంధ్రావ‌ని వ్యాప్తంగా త్వ‌ర‌లో మ‌రిన్ని బుల్డోజ‌ర్ ఎఫెక్టులు క‌నిపించ‌నున్నాయ‌ని టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలి అని కల‌లు కంటున్న పార్టీ నేత‌లు అనుస‌రించాల్సిన వైఖ‌రి ఇది కాద‌ని హిత‌వు చెబుతోంది. ఎలా చూసుకున్నా ఇటువంటి చ‌ర్య‌లు త‌మకే లాభం అని కూడా అభిప్రాయ‌ప‌డుతోంది.గ‌తంలో టీడీపీ చేసిన తప్పులకు రెట్టింపు తప్పులు ఇప్పుడు వైసీపీ చేస్తోంద‌ని, ఎన్నిక‌ల కార‌ణంగా పాల‌కులంద‌రూ మారినా కూడా పాలక వ్య‌వ‌స్థ లో పెద్ద‌గా మార్పుల‌న్న‌వి లేనేలేవ‌ని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయప‌డుతున్నారు.

నర్సీప‌ట్నంలో టీడీపీ నేత అయ్య‌న్న ఇంటి గోడ ను బుల్డోజ‌ర్ తో కూల్చేసింది వైసీపీ స‌ర్కారు. అదేవిధంగా ఛ‌లో నర్సీప‌ట్నం కార్య‌క్ర‌మాన్ని కూడా భ‌గ్నం చేసింది వైసీపీ స‌ర్కారు. అదేవిధంగా మ‌రో చోట మ‌ట్టిత‌వ్వ‌కాల‌ను నిల‌దీసిన ధూళిపాళ న‌రేంద్ర ను కూడా అరెస్టు చేశారు.

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా, అనుమర్ల పూడి చెరువు త‌వ్వ‌కాల‌ను నిల‌దీసినందుకు సంబంధిత నిర‌స‌న‌కారుల‌ను ఈడ్చుకుంటూ వెళ్లి గృహ నిర్బంధానికి వారిని ప‌రిమితం చేశారు. ఈ విధంగా ఒకే రోజు రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల కార‌ణంగా టీడీపీ మ‌రింతగా మాట్లాడేందుకు అవ‌కాశం దొరికింది.

ఎప్ప‌టి నుంచో మ‌ట్టి త‌వ్వ‌కాల గురించి మాట్లాడాల్సినంత ఎవ్వ‌రూ మాట్లాడ‌డం లేదు అని క‌మ్యూనిస్టు పార్టీలు కూడా ఆవేద‌న చెందుతున్నాయి. ఇప్పుడు మాట్లాడినా కూడా వైసీపీ స‌ర్కారు ఒప్పుకునే విధంగా లేద‌నే ప‌రిణామాలు చెబుతున్నాయి అని క‌మ్యూనిస్టులు ప్ర‌తిస్పందిస్తూ ఉన్నారు. క‌మ్యూనిస్టులే కాదు విప‌క్షాలు అన్నీ గృహ నిర్బంధాల‌ను భరించే ఉన్నాయి.

చాలా వ‌ర‌కూ నాయ‌కులు ఎటువంటి నోటీసులు అందుకోకుండానే పోలీసు స్టేష‌న్ల‌లో ఉండిపోతున్నారు. అది అదుపులోకి తీసుకోవ‌డ‌మా ? లేదా అరెస్టు చూపించ‌డ‌మా ? అన్న‌వి కూడా త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ నాయ‌కులు వాపోతున్నారు. నిన్న కూడా ఇదేవిధంగా అరెస్టు అయిన నాయ‌కుల‌ను స్టేష‌న్ల‌కు త‌ర‌లించే క్ర‌మాన అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు అనేందుకు మీడియాలో వ‌చ్చిన దృశ్యాలే తార్కాణం అని టీడీపీ అంటోంది.

ఇక తాజా గృహ నిర్బంధాలు అన్న‌వి, అరెస్టులు అన్న‌వి ఏ మేర‌కు టీడీపీ ప్ర‌జా బ‌లాన్ని పెంచుకునే విధంగా చేస్తాయో అన్న‌ది కీల‌కం. అస్స‌లు ఏమీ అడ‌గ‌వ‌ద్దు.. మేం చేసిందే సబ‌బు అన్న విధంగా వైసీపీ ఉంద‌ని టీడీపీ మండిప‌డుతోంది. విలువైన ఇసుక, మ‌ట్టి త‌ర‌లింపుల్లో నిబంధ‌న‌ల పాటింపు అన్న‌ది లేనేలేద‌ని, అటువంటిది న‌దుల శుభ్రం కోసం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం సీఎం స్థాయి వ్య‌క్తులు ఏ విధంగా మాట్లాడుతారు అని విప‌క్ష నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.