Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కు ఏపీ పోలీసులు.. నలుగురు ముఖ్యుల అరెస్ట్
By: Tupaki Desk | 25 Dec 2018 9:56 AM GMTహైదరాబాద్‌లో మళ్లీ మావోయిస్టుల కలకలం చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఏపీలో పంజా విసురుతున్న మావోయిస్టులకు సంబంధించిన కీలక చర్యకు హైదాబాద్ వేదికగా నిలిచింది. హైదరాబాద్ లో నలుగురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మౌలాలీ ప్రాంతంలో అనూష- అన్నపూర్ణ- భవానీ- కామేశ్వరరావు లను అరెస్టు చేశారు. వీరు నలుగురూ 2017 ఉంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్లొంటున్నారని పోలీసులు చెప్పారు.
ఏపీలో ఇటీవల మావోయిస్టుల ప్రభావం పెద్ద ఎత్తున తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు- సివిరె సోమను మావోలు కాల్చిచంపారు. 'కిడారి- సోమలు ఆస్తులు కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు మద్దతుగా నిలిచిరు. కిడారి- సోమలను శిక్షించే ముందు గంటసేపు ప్రజా కోర్టు నిర్వహించాం. మావోయిస్టులు ఉనికి కోసమే కాల్పులకు పాల్పడ్డామన్న ఆరోపణల్లో నిజం లేదు. మా పోరాటాలు కొనసాగుతాయి' అని ఆ లేఖలో వివరించారు.
దీంతో పోలీసులు మావోల ఉనికి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో విశాఖ నుంచి నలుగురు మావోయిస్టులు హైదరాబాద్ కు చేరుకున్నారనే పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు నగరానికి వచ్చి వీరిని అరెస్ట్ చేశారు. పోలీసుల పై దాడి చేసిన 3 ఘటనల్లో వీరి ప్రమేయం ఉందన్నారు. గత ఏడాది అగ్రనేత రామకృష్ణతో కలిసి వీరు పనిచేశారని, మావోయిస్టు పార్టీ బలోపేతానికి పని చేశారని చెప్పారు. అరెస్టయిన వారిలో ఇద్దరు అక్కాచెళ్లెల్లున్నారని తెలిపారు. కాగా ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.