Begin typing your search above and press return to search.
పెళ్లి వాయిదా వేయాల్సిందే...ఏపీ యువకుడికి నోటీసులు !
By: Tupaki Desk | 19 March 2020 5:45 AM GMTపెళ్లి ..ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద పండుగ. ఆ క్షణం కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అందరిలాగే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఏపీకి చెందిన ఒక యువకుడు, తన పెళ్లి ఫిక్స్ అవ్వడం, మరో కొన్ని రోజుల్లోనే పెళ్లి ముహూర్తం ఉండటం తో పెళ్లి వేడుక కోసమే ఆ యువకుడు అమెరికా నుంచి వచ్చాడు. శుభలేఖలు పంచి బంధుమిత్రులందరినీ తన పెళ్ళికి ఆహ్వానించారు. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్న క్రమంలో మంగళవారం ఆ పెళ్లి కొడుకుకి ..వెంటనే పెళ్లి ఆపాలంటూ ఒక నోటీస్ వచ్చింది.
అదేంటి పెళ్లి ఆపాలంటూ నోటీసు రావడం ఏంటి అని అనుకుంటున్నారా? అదే కలికాలం ముహూర్తం బాగాలేదు , ఇంకేదో కారణాల తో పెళ్లి ఆపాలని చెప్పడం చూసాము కానీ , దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఏపీ పోలీసులు ఆ పెళ్లి కొడుకుకి నోటీసులు ఇచ్చారు.
వరుడు ఈ మద్యే అమెరికా నుంచి అతడు రావడం తో.. 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పెళ్లిని వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో మరో రెండు రోజుల్లో పెళ్లి తంతు కూడా ముగిసిపోతుంది అనుకున్న ఆ ఇరు కుటుంబాలు డైలమాలో పడ్డాయి. కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కాగా, ఏపీలో ఇప్పటివరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడికి కరోనావైరస్ సోకడం తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలులో ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇతడు 2020, మార్చి 13వ తేదీన లండన్ నుంచి వచ్చాడు. యువకుడికి రక్తనమూనాలు సేకరించి..తిరుపతి ల్యాబ్ కు పంపించారు.ఇతని కుటుంబసభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వెంటనే జిల్లా కలెక్టర్ భాస్కర్ అప్రమత్తమయ్యారు. యువకుడు నివాసం ఉంటున్న ప్రాంతంలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలకు నేటి నుంచి సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులకే కరోనా సోకడం తో ఎయిర్ పోర్టుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసి పరీక్షలు చేస్తున్నారు. విదేశాల నుండి వచ్చేవారికి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ 14 రోజులు స్వీయ నిర్బంధలో ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా నుండి వచ్చిన కాబోయే పెళ్ళికొడుకుకి నోటీసులు పంపారు పోలీసులు.