Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే కి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   14 Nov 2019 5:51 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే కి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు .. ఏమైందంటే ?
X
సాధారణం గా ఏ రాష్ట్రం లో అయినా కూడా పోలీసులు ప్రభుత్వానికి కొంచెం మద్దతు గా వ్యవహరిస్తారు అన్నది జగ మెరిగిన సత్యం. ప్రభుత్వమే వారి చేతుల్లో ఉంటుంది కాబట్టి వారి మాటలని వినాల్సి ఉంటుంది. కానీ , ఏపీ లో మాత్రం దీనికి రివర్స్ లో జరుగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి .. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమం లోనే సీఎం జగన్ ..పోలీసుల కి ఫుల్ పవర్ ఇచ్చేసారు. అధికార పక్షం అయిన , విపక్షం అయిన కూడా ఎవరైనా పోలీసులు చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పారు. దీనితో పోలీసులు ఆ పార్టీ ఎమ్మెల్యే లకే తమ సత్తా ఏంటో చూపించారు. అసలు పోలీసులు ఏం చేసారంటే ..

ప్రస్తుతం ఏపీలో ఇసుక కోసం రస వత్తర పోరాటం సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల విమర్శలు , ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతి సవాళ్ళతో ఏపీ అట్టుడుకి పోతుంది. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయం గా ఈ సమస్యని వాడుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే ఇసుక కొరత కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయవాడ లోని ధర్నా చౌక్ లో ఇసుక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. చంద్రబాబు దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఇక ఈ దీక్షకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయి.

ఈ మద్యే టీడీపీ నేతలు ..కొందరు వైసీపీ ఎమ్మెల్యే లే ఇసుకని అక్రమంగా పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు అని ఆరోపించారు. ఈ ఆరోపణల పై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. బాబు చే పడుతున్న దీక్షకు పోటీగా తాను కూడా దీక్ష చేపడతానని ప్రకటించారు. తాను ఇసుక దాచా ను అని చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దాచిన ఇసుక తో ఏం పనులు చేశానో వాటి పై బాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే చంద్రబాబు దీక్ష చేసే వేదికకు దగ్గర్లోనే తాను కూడా నిరసన చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ధర్నా చౌక్ వద్ద తన దీక్షకు అనుమతించాలని హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు. అయితే పార్థసారథి దీక్షకు అనుమతి నిరాకరించి పోలీసులు షాక్ ఇచ్చారు. ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వద్దు అన్న కారణంగానే ప్రభుత్వం పార్థసారథి దీక్షకు పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం.