Begin typing your search above and press return to search.
ఇడ్లీ, దోశల్లా నకిలీ సర్టిఫికెట్లు అమ్మేశారు.. వీళ్ల దందా మాములుగా లేదు!
By: Tupaki Desk | 15 Sep 2020 2:30 AM GMTమీకు బీటెక్ సర్టిఫికెట్ కావాలా.. లేక అగ్రికల్చర్ డిప్లమానా.. ల్యాబ్టెక్నిషిన్ది అయినా ఇచ్చేస్తాం.. ఏళ్లకెళ్ళు కష్టపడి చదవాల్సిన అవసరం లేదు.. నిమిషాల్లో సర్టిఫికెట్ మీ ముందు ఉంటుంది. ఇంతవరకు వేలల్లో సర్టిఫికెట్లు జారీచేశాం. ఎవ్వరూ గుర్తించలేదు. కాకపోతే ప్రతి సర్టిఫికెట్‌కు ఓ రేటుంది’ ఆంధ్రప్రదేశ్‌లో ఓ ముఠా భాగోతమిది.. ఫేక్సర్టిఫికెట్లను సృష్టిస్తూ విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా నెల్లూరు కేంద్రం ఓ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. జేఎన్‌టీసీ (జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఫేక్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సంస్థ చేసిన అక్రమాలపై దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో వీళ్లు బ్రాంచీలను ఓపెన్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారంటే రాకెట్ ఎంత పెద్దదో ఆలోచించవచ్చు.
దందా సాగుతున్న తీరు ఇది..
నెల్లూరుకు చెందిన జంపని వెంకటేశ్వర్లు(49),సిలారపు బాల శ్రీనివాసరావు(53),సిలారపు సుజాత(47),సిద్ది శ్రీనివాసరెడ్డి(25),కోడూరి ప్రదీప్ కుమార్(32),అనపర్తి క్రిస్టఫర్(47),బట్ట పోతుల వెంకటేశ్వరరావు(48) ముఠాగా ఏర్పడి ఈ దందాను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాకేంద్రాల్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పేరుతో దుకాణాలను తెరుస్తారు. అనంతరం ఏజెంట్ల ద్వారా జనాలను ఆకర్షించి డబ్బులు గుంజి సర్టిఫికెట్లు జారీచేస్తారు. ముఠా సభ్యులపై ఐపీసీ సెక్షన్లు 420,468,471ల కింద ఫోర్జరీ చీటింగ్,ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాదాపు ఈ ముఠా 2400 నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ముఠా విస్తరించింది. అయితే ఏపీలోనే 1900 సర్టిఫికెట్లు జారీచేయడం గమనార్హం.
గుట్టు రట్టయిందిలా..
ఇటీవల వ్యవసాయాధికారులు ఓ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడి యజమాని వారికి తన అగ్రికల్చర్ డిప్లొమో సర్టిఫికెట్ ఇదేనంటూ ఓ సర్టిఫికెట్ చూపించాడు. అధికారులు దాన్ని పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూపీ లాగడంతో ఈ దందా మొత్తం బయటపడింది. ఈ ముఠా సర్టిఫికెట్ల కోసం రూ. రెండువేల నుంచి రూ.8000 తీసుకుంటున్నట్టు విచారణలో తేలింది. ఈ కేసును సిట్ దర్యాప్తునకు అప్పగించనున్నట్టు సమాచారం.