Begin typing your search above and press return to search.
ఒక్క చాన్స్... రెండోస్సారి...నాలుగోసారి.....?
By: Tupaki Desk | 21 Aug 2022 2:30 AM GMTఅవును రాజకీయ నేతాశ్రీలు జనాల వద్దకు వచ్చి వేడుకుంటున్నారు. ఒక్క చాన్స్ ఇవ్వండని చెప్పి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అంటూంటే వరసగా రెండవసారి నేనే సీఎం అని జగన్ అంటున్నారు. ఇక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబు అయితే ఏపీని రిపేర్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి నాలుగవ సారి సీఎం గా ప్రమాణం చేస్తాను అని అంటున్నారు. ఇలా మూడు పార్టీలు ముగ్గురు నాయకులూ జనాలకు తమదైన శైలిలో అప్పీలు చేస్తూ ఉంటే మరి ఏపీ జనాలు ఏ రకంగా ఆలోచిస్తారు అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉంది.
ఒక్క చాన్స్ అన్నది చాలా పవర్ ఫుల్. దానిలో మజా కూడా ఉంది. చూడని సినిమా మీద మోజు క్రేజు కూడా ఉంటాయి. అలా ఒక్క చాన్స్ అయితే బలంగా పనిచేసే నినాదమే. అయితే ఈ నినాదం ఈ రోజున పుట్టింది కాదు చాణ్ణాళ్ళ నుంచే రాజకీయాల్లో ఉంది. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో బీజేపీ వారు లోక్ సభ ఎన్నికల వేళ మాకో చాన్స్ ఇవ్వండి అంటూ జనాల వద్దకు వెళ్ళారు. వారు అలా ప్రచారం చేసుకుంటూంటే నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి దాని మీద వ్యంగ్యంగా ఒక సెటైర్ వేశారు.
ఆయన కూడా ఎన్నికల సభలలో మాట్లాడుతూ బీజేపీ వారు ఒక్క చాన్స్ అంటున్నారు. ఏమిటది. ఒక్క చాన్స్ అంటే పరిపాలన. ఏదో ఈజీగా అడిగేస్తున్నారు. జనాలు జర జాగ్రత్త అని హెచ్చరించారు. ఇక ఒక్క చాన్స్ అని అడిగిన వారిని ఎవరినీ జనాలు తొలి ప్రయత్నాన ఆదరించలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి.
2009 ఎన్నికల్లో సినీ రంగాన మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన ఒక్క చాన్స్ అంటూ ప్రతీ చోటా రిక్వెస్ట్ చేశారు. అయితే ఎందుకో నాడు జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇక రెండవ బలమైన పార్టీగా టీడీపీని చాన్స్ ఇచ్చారు. ప్రజారాజ్యానికి సీట్లూ ఓట్లు ఇచ్చారు కానీ ఇంకా టైముందని చెప్పి మూడవ ప్లేస్ లో ఆపేశారు. మరి నాడే చిరంజీవి జాగ్రత్తగా పార్టీని నడిపి ఉంటే ఆయన ఒక్క చాన్స్ ముచ్చట ఏదో నాటికి తీరేది.
ఇక జగన్ 2012లో పార్టీ పెట్టి 2014లో ఒక్క చాన్స్ ఇవ్వడని జనాలను అడిగితే నాడు విభజన ఏపీలో అనేక సమస్యలు ఉన్న కారణంగా జనాలు ఇవ్వలేదు. జగన్ని విపక్ష నేతగా చేసి అనుభవం సంపాదించమన్నారు. ఆ మీదటనే విపక్ష నేతగా ఆయన పనితీరు చూసి 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్ అంటే ఇచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయం వస్తే ఆయన ఒక్క చాన్స్ ఇవ్వండి అని 2019 ఎన్నికలలోనే అడిగారు. కానీ నాడు బలమైన విపక్షంగా వైసీపీ ఉండడం, అప్పటికే ఆ పార్టీ ఒక్క చాన్స్ అంటూ రెండు ఎన్నికల నుంచి అడగడంతో వైసీపీకి ఓటేసి సీఎం సీటు ఇచ్చారు. ఇపుడు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కోసం ఒక్కచాన్స్ అంటున్నారు అయితే పవన్ పార్టీ ఇంకా బలంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
ఎకాఎకీన సీఎం సీటు ఇవ్వడం అంటే జనాలు ఆలోచిస్తారు. పవన్ ముందు ఎమ్మెల్యే కావాలి. రాజకీయ అనుభవం గడించాలి అని భావిస్తే మాత్రం కచ్చితంగా ఆయనకు ఈసారి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి ఏపీ రాజకీయాల్లో కీలకం చేస్తారేమో చూడాలి. లేదా పవన్ తాను ఒక ఎన్టీయార్ మాదిరిగా జనాలను మెస్మరైజ్ చేస్తే కచ్చితంగా ఒక్క చాన్స్ హిట్ అయినా కావచ్చేమో. ఏది ఏమైనా చూడాలి దాన్ని.
ఇక ఇపుడు జగన్ ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ఆయన రెండవ చాన్స్ కూడా ఇవ్వండి అని వేడుకుంటున్నారు. మరి జగన్ కి రెండవ చాన్స్ ఇవ్వడం కంటే కష్టమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇలా ఎందుకు అంటే మొదటి మోజు ఎపుడూ మధురం. అలా ఒక్క చాన్స్ అంటే జనాలు జగన్ ఎలా పాలిస్తారో అన్న మధురమైన భావనతో చాన్స్ ఇచ్చారు. ఇక రెండవ చాన్స్ అన్నది ప్రజలు ఇవ్వడం కంటే జగన్ చేతిలోనే ఉంది. తన అయిదేళ్ళ పాలన ముందు పెట్టుకుని జగనే తనకు రెండవ చాన్స్ జనాలు ఇస్తారా లేదా అన్న ఒక విశ్లేషణకు రావచ్చు అని కూడా అంటున్నారు. జగన్ పాలన ఓకే అనుకుంటేనే జనాలు రెండవమారు వరసగా సీఎం ని చేసేది.
ఇక చంద్రబాబు. ఆయన సీనియర్ నేత. నాలుగవ సారి చాన్స్ అంటున్నారు. బాబుకి విషయం ఉన్నా ఆయనకు ఏజ్ ఫ్యాక్టర్ ఒక సమస్య. పైగా విశేష అనుభవమే ఆయనకు మైనస్ అవుతోంది. ఆయన ఏపీ రాజకీయాల్లో చూస్తే ఓల్డ్ పొలిటీషియన్ గానే కనిపిస్తున్నారు. దాంతో పాటు బాబు వస్తే పాలన ఏలా ఉంటుంది అన్నది దాదాపుగా అందరికీ ఒక అవగాహన ఉంది. దానిని మించి అంటూ ఆయన జనాలను నమ్మించగలిగితేనే నాలుగవ చాన్స్ దక్కుతుంది.
మరి చూడాలి బాబు గారి మీద జనాలకు ఎంతటి నమ్మకం ఉంటుందో. ఏది ఏమైనా జనాలు చాలా తెలివైన వారు. మాకు ఒక్క చాన్స్ అంటే మాజీ సీఎం నేదురుమల్లి చెప్పినట్లుగా పాలన అంటే అంత సులువా అయిదేళ్ళ పాటు మా భవిత మీ చేతిలో పెట్టాలా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అన్నది నిజం.