Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ : బీజేపీ డబుల్ గేమ్...ఖంగుతిన్న వైసీపీ...?

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 AM GMT
ఏపీ పాలిటిక్స్ : బీజేపీ డబుల్ గేమ్...ఖంగుతిన్న వైసీపీ...?
X
ఏపీలో పాలిటిక్స్ చూస్తే చాలా తమాషాగా ఉంటాయి. ఏపీ అసెంబ్లీలో చెప్పడానికి  ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేరు. ఆ పార్టీ తరఫున జనంలో నిలబడి గెలిచిన ఎంపీ కూడా లేడు. కానీ మొత్తానికి మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపీలు కూడా జై బీజేపీ అంటున్నారు. బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మునకు ఏపీలో టోటల్ ఓట్లు అలా పడిపోతున్నాయి. అంతే కాదు రాజ్యసభలో ఉన్న ఏపీ తరఫున ఉన్న టోటల్ 11 మంది ఎంపీలు కూడా జై బీజేపీ అంటున్నారు.

ఇదంతా బీజేపీ బలమే మరి. ఈ మధ్యనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఏపీలో బీజేపీకి ఉన్న బలం వారి సొంత రాష్ట్రాలలో కూడా లేదు అనుకోవాలి. యూపీ తీసుకుంటే అక్కడ నూటికి నూరు శాతం ఓట్లు బీజేపీకి పడవు, అంతేనా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ కూడా సాలిడ్ గా ఓట్లు నూరు శాతం పడే చాన్సే లేదు, కానీ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం ఏపీలో మాత్రం అధికార విపక్ష పార్టీలు రెండూ కూడా జై బీజేపీ అంటున్నాయి.

మరీ ఇంత ఐక్యత ఎలా వచ్చింది. ఏపీలో రాజకీయం బాగుందే అనుకోవాడానికి లేదు. అధికార వైసీపీ విపక్ష టీడీపీ రెండూ కూడా ఉప్పూ నిప్పులా ఉంటాయి. ప్రతీ దానికీ రెండు పార్టీలు గొడవ పడతాయి. ఏకాభిప్రాయం అయితే అసలు లేదు. ఇలా పోటీ పడుతున్న ఈ రెండు పార్టీలు ఒకే ఒక విషయంలో అదే బీజేపీని లవ్ చేసే దాంట్లో మాత్రం ఒక్కటిగా ఉంటాయి. అందుకే ఇలా జరుగుతోంది అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే టీడీపీని దూరం పెట్టడానికి వైసీపీ బీజేపీతో లవ్ చేస్తోంది అని చెబుతారు. తాము ద్రౌపది ముర్మునకు మద్దతు ఇస్తున్నాం కాబట్టి తమ వైపే బీజేపీ ఉండాలని ఉంటుందని అనుకుంటున్నారు.  కానీ బీజేపీ మాత్రం రాజకీయ తెలివిడితో వైసీపీనే ఖంగు తినిపించింది. నిజానికి టీడీపీ బీజేపీకే మద్దతు అన్నది మనసులో అనుకుందిట. అయితే అది బయటకు చెప్పకుండా ద్రౌపది ముర్ము ఏపీకి వస్తారు అనగా ఒక రోజు ముందు ఫుల్ సపోర్ట్ బీజేపీకే అనేసింది.

ఆ మీదట బీజేపీ వారితో ఉన్న లోపాయికారీ అవగాహనతో టీడీపీ కూడా ద్రౌపది ముర్ముతో పరిచయ కార్యక్రమం బాగా నిర్వహించింది. ఆ విధంగా తాము కూడా వైసీపీకి ధీటుగా ఉన్నామనుకుంది. చంద్రబాబు సైతం తాము సామాజిక న్యాయం అమలు చేస్తామని రాష్ట్రపతి ఎన్నికల సాక్షిగా  గొప్పగా చెప్పుకున్నారు. ఇక్కడే వైసీపీ హర్ట్ అయింది. బాగా దెబ్బ కూడా తింది అంటున్నారు.

ఏపీలో ద్రౌపది ముర్ము వచ్చి తమనే కలసి వెళ్ళిపోతారు అని వైసీపీ వారు అనుకున్నారు. ఇక టీడీపీకి చూస్తే స్వల్పంగానే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ పెద్ద లెక్క కాదు అని కూడా భావించారు. కానీ తమ వద్దకు వచ్చి మద్దతు తీసుకున్నాక ఆనక అక్కడా బీజేపీ వారు వాయినాలు తీసుకోవడంతో వైసీపీకి ఎక్కడో కాలినట్లు అయిందని అంటున్నారు. అంటే ఏపీ రాజకీయాలో 151 సీట్లు 22 ఎంపీలు, తొమ్మండుగురు రాజ్య సభ ఎంపీలు ఉన్న తామూ, పుంజీడు మంది కూడా లేని టీడీపీ ఒక్కటేనా అన్న బాధ అయితే వైసీపీ వారిలో కలుగుతోందిట.

అంతే కాదు టీడీపీ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్  సోము వీర్రాజు చెప్పడం కూడా మంట ఎక్కేలా ఉందిట. దాంతో బీజేపీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా. చంద్రబాబుతో అసలు ద్రౌపది ముర్ము పరిచయ కార్యక్రమం సడెన్ గా ఎలా జరిగింది అని ఆరా తీసే దాని వెనక చాలా కధ ఉందని తేలిందట.

అంతే కాదు, వైసీపీకి ఈ సీక్రెట్ తెలియకుండా దాచడంతో బీజేపీ టీడీపీ రెండూ సక్సెస్ అయ్యాయని అంటున్నారు. మొత్తానికి ఏపీలో చూస్తే వైసీపీ నూటికి ఎనభై శాతానికి బలం ఉన్నా కూడా టీడీపీ రాజకీయ వ్యూహాల ముందు బీజేపీ డబుల్ గేమ్ ముందు తేలిపోయింది అంటున్నారు. ఇపుడు జరిగింది జస్ట్ శాంపిల్ మాత్రమే రానున్న రోజుల్లో అసలు కధ ఉంది అని టీడీపీ శిబిరం చెబుతోంది. దీన్ని బట్టి ఎన్నికల నాటికి బీజేపీ డబుల్ గేమ్ మరింతగా ముదిరి పాకాన పడితే వైసీపీకి షాకులు చిక్కులూ తప్పవా అంటే వెయిట్ అండ్ సీ.