Begin typing your search above and press return to search.
ఏపీ అంటే కులాలు...ప్రాంతాలేనా...మరో మాట లేదా...?
By: Tupaki Desk | 7 Dec 2022 5:01 PM GMTఏపీ అంటే మాట్లాడుకోవాల్సింది కులాల గురించేనా. ఏపీ అంటే .ప్రాంతాల మధ్య ఆధిపత్యమేనా. ఏపీ అంటే ఏ కులం ఎక్కువ ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎలా గేలం వేయాలి అన్న ఆలోచనేనా. ఏపీలో అభివృద్ధి అన్న మాట ఎక్కడో నూతిలో లోతుల్లో కూడా వినిపించడంలేదెందుకు. ఇదీ ఇపుడు చాలా మంది మేధావులు ముక్కున వేలేసుకుని అనుకునే మాట.
నిజానికి ఏపీలో ఇపుడు సభలు జరుగుతున్నాయి. అతి పెద్ద సదస్సులు జరుగుతున్నాయి. కానీ అక్కడ చెప్పేదేంటి. వాటి అజెండా ఏంటి అంటే ప్రాంతాలు కులాల మధ్యనే అక్కడ చర్చ సాగుతోంది. పట్టుమంది రెండు నెలలు కూడా గడవలేదు. కానీ ఏపీలో భారీ సభలు మూడు వైసీపీ నిర్వహించింది. అధికారంలో ఉంటూ ఆ పార్టీ నిర్వహించిన సభలు మూడు చోట్లా ఎలా ఉన్నాయి అంటే చెప్పుకోవడానికి చిత్రంగానే ఉంటుంది.
అక్టోబర్ 15న విశాఖ గర్జన పేరుతో విశాఖ పరిపాలనా రాజధాని కావాలని సభ నిర్వహించింది. ఆ సభ అంతా విశాఖ వైభోగం గురించి ఊదరగొట్టింది. ఉత్తరాంధ్రాను ప్రత్యే సబ్ రీజియన్ గా చేస్తూ ఆధిపత్య పోరుని హైలెట్ చేసింది. ఇక ఈ మధ్యనే కర్నూలులో మరో గర్జన జరిగింది. దానికి సీమ గర్జన పేరు పెట్టారు.
అక్కడ రాయలసీమకు రాజధాని కావాలంటూ గర్జించారు. సీమకు అన్యాయం జరిగిపోతోంది అని వైసీపీ నేతలు అంతా గుండెలు బాదుకున్నారు. ఆ సభలో శ్రీ భాగ్ ఒప్పందాన్ని పైకి తీసుకువచ్చి మరీ హడావుడి చేశారు. మీ సంగతేంటో చెప్పమని టీడీపీని చంద్రబాబుని నిలదీసారు. ఆ విధంగా ఆ సభ ముచ్చట ముగిసింది.
ఇల తాజాగా చూస్తే విజయవాడ నడిబొడ్డున మరో సభ జరిగింది. దాని పేరు జయహో బీసీ. ఇది ఫక్తు కులం సభ. ఈ సభ ద్వారా బీసీలకు తామేమి చేశామో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా ఏకరువు పెట్టారు. మేము చేసినట్లుగా ఎందుకు చేయలేదంటూ చంద్రబాబుని డిమాండ్ చేశారు. బీసీలు మా వెంటే అన్నారు. వారితోనే మేము అని చెప్పుకున్నారు. ఇలా సంకుల సమరానికి తెర తీశారు.
ఇపుడు చూస్తే ఏపీలో ఏ సభ వెనక అయినా కులం, ప్రాంతం తప్ప అభివృద్ధి అన్న మాట ఎక్కడైనా వినిపిస్తోందా అన్న డౌట్ వస్తే తప్పు ఆ సభలను పెట్టిన వారిది కానే కాదు. ఏపీలో పుట్టినందుకు అనుకోవాలేమో. ఏపీ విభజన తరువాత కునారిల్లిపోయింది. ఏపీలో అన్ని విధాలుగా అయిదు కోట్ల మంది అన్యాయం అయిపోయారు. గతీ గత్యంతరం ఏపీకి లేకుండా పోతోంది. అలాగే ఏపీకి రావాల్సినవి రావడంలేదు. తేలాల్సినవి తేలడం లేదు. ఆస్తులు అన్నీ హైదరాబాద్ లో ఉండిపోయాయి.
విభజన హామీలన్నీ ఢిల్లీలోనే ఆగిపోయాయి. ఏపీకి అప్పులు మిగిలిపోయాయి. రాజధాని లేదు, అభివృద్ధి అంతకంటే కానరాదు. అయినా సరే ఇపుడు అర్జంటుగా కులాలు, ప్రాంతాలు గుర్తుకొస్తున్నాయి. వీటిని అడ్డం పెట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూస్తే అది రాజకీయం చేసే వారి హక్కు అనుకోవచ్చు. కానీ ఏపీ సమాజం ఇది కాదు మన బతుకు ఇది కాదు మన నీతి అంటూ ఎందుకు ఉద్యమించలేకపోతుంది అన్నదే కదా అసలైన డౌట్. మరి దానికి జవాబు దొరికితేనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందేమో. లేకపోతే ఎన్నికల అజెండాగా వీటినే సెట్ చేసుకుంటారు. వీటి చుట్టూనే అన్ని పార్టీలు చక్కర్లు కొడతాయి. ఆఖరుకు జనం నోట్లో మట్టి కొడతారు. ఇది కదా మ్యాటర్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.