Begin typing your search above and press return to search.

మూడుపై మ‌రింత సాగ‌దీత‌.. టార్గెట్ ఎల‌క్ష‌న్స్‌..!

By:  Tupaki Desk   |   20 Sep 2022 12:30 AM GMT
మూడుపై మ‌రింత సాగ‌దీత‌.. టార్గెట్ ఎల‌క్ష‌న్స్‌..!
X
రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు ఎప్పుడు వ‌స్తాయి? ప్ర‌స్తుత స‌ర్కారు హ‌యాంలోనేవ‌స్తాయా? లేదా? ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు క‌లిసినా.. ఫోన్లు చేసుకున్నా.. జ‌రుగుతున్న‌చ‌ర్చ‌. అయితే.. దీనిపై కొంద‌రు భిన్న‌మైన వాద‌న వినిపిస్తున్నారట‌. మూడు రాజ‌ధానులు ఇప్ప‌ట్లో ఉండ‌వ‌ని.. దానికి ఆట్టే స‌మ‌యం కూడా లేద‌ని... కొంద‌రు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నార‌ట‌. ఎన్నిక‌ల వ‌రకు ఈ విష‌యాన్ని సాగ‌దీసే వ్యూహంతోనే వైసీపీ కూడా ఉంద‌ని.. మేధావులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎందుకంటే.. ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా మూడు రాజ‌ధానుల అంశం తేల‌దు. ప్ర‌స్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంటే.. అక్క‌డ మ‌ళ్లీ విచార‌ణ క‌నుక ప్రారంభ‌మైతే.. వాయిదాల‌పై వాయిదాలు ప‌డ‌డం ఖాయం. దీంతో ఎంత‌లేద‌న్నా.. క‌నీసం.. మ‌ళ్లీ ఈ విష‌యం తేలేసరికి ఆరు నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ప‌ట్టినా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక‌, అప్ప‌టికి ఎలానూ.. ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేస్తుంది. ఇంతలోనే.. విశాఖ నుంచి సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యం వేదిక‌గా పాల‌న ప్రారంభించే అవ‌కాశం ఉంటుంద‌ని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఇక‌, అప్పుడు.. దాదాపు ఏడాదిపాటు.. పాల‌న‌ను అక్క‌డ నుంచి చేయ‌డంతోపాటు.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో సీఎం త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తార‌ని అంటున్నారు. త‌ద్వారా.. ప్ర‌స్తుతం రాజ‌ధాని పై ఎలాంటి ఊసూ పెద్ద‌గా లేని ఉత్త‌రాంధ్ర‌లో రాజ‌ధాని వ‌స్తే.. ఇంత‌క‌న్నా బాగుటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌దీస్తార‌ని చెబుతున్నారు.

ఇక‌, ఎన్నిక‌ల నాటికి బ‌ల‌ప‌డుతుంది. వైసీపీ అధిష్టానం కూడా కోరుకుంటోంది ఇదే. సో.. అప్ప‌టికీ.. మూడుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండానే..ఎన్నిక‌ల‌కు వెళ్తుంది. త‌ద్వారా.. దీనిని మేనిఫెస్టోలో పెట్టినా ఆశ్చ‌ర్యపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

దీంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌.. మూడు రాజ‌ధానుల సెంటిమెంటును ర‌గిలించి.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని.. నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీలోనే ఓ వ‌ర్గం భావిస్తోంది. దీనివ‌ల్ల‌.. ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు కూడా.. అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.